తోక ముడిచిన సీనియ‌ర్ హీరో

మ‌హిళ‌ల‌పై అవాకులు చెవాకులు పేలిన బాలీవుడ్ సీనియ‌ర్ హీరో ముఖేశ్ ఖ‌న్నా ఎట్ట‌కేల‌కు త‌న త‌ప్పు తెలుసుకున్నారు. త‌ప్పైంద‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పుకోవాల్సి వ‌చ్చింది.  Advertisement విచ‌క్ష‌ణ మ‌రిచి మాట్లాడితే ఏమ‌వుతుందో ముఖేశ్ ఖ‌న్నా వ్య‌వ‌హారాన్ని…

మ‌హిళ‌ల‌పై అవాకులు చెవాకులు పేలిన బాలీవుడ్ సీనియ‌ర్ హీరో ముఖేశ్ ఖ‌న్నా ఎట్ట‌కేల‌కు త‌న త‌ప్పు తెలుసుకున్నారు. త‌ప్పైంద‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పుకోవాల్సి వ‌చ్చింది. 

విచ‌క్ష‌ణ మ‌రిచి మాట్లాడితే ఏమ‌వుతుందో ముఖేశ్ ఖ‌న్నా వ్య‌వ‌హారాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. అస‌లు వివాదం ఏంటో, ముఖేశ్ ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చిందో తెలుసుకుందాం.

‘మీటూ’ ఉద్యమం గురించి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల‌పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఓ ఉద్య‌మంలా మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు మాత్రం ఓదార్పు మాట‌లేవో చెప్ప‌డం, ఆ త‌ర్వాత స‌ర్దుకుపోవ‌డం చూస్తున్నాం. 

ఈ నేప‌థ్యంలో ‘మీటూ’ ఉద్యమంపై బాలీవుడ్ సీనియ‌ర్ హీరో ముఖేశ్ ఖ‌న్నా అనుచిత వ్యాఖ్యలు చేసి కోరికోరి వివాదాన‌ని మీదికి తెచ్చుకున్నాడు.

‘సమాజంలోని ప్రతి అంశంలో తామూ మ‌గ‌వాళ్ల‌తో సమామని భావించడం వల్లే మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ఎప్పుడైతే ఆడవాళ్లు బయటకొచ్చారో అప్పటి నుంచే `మీటూ` మొదలైంది.

`మీ టూ` ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలలే. వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిది ’ అని  ముఖేష్ వ్యాఖ్యానించాడు. 

లైంగిక వేధింపుల‌కు ఆడ‌వాళ్లే బాధ్య‌త అన్న‌ట్టు ముఖేశ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌హిళా సంఘాలు, న‌టీమ‌ణులు, నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ముఖేశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున త‌న‌ను ట్రోలింగ్ చేస్తున్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ముఖేశ్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డంతో పాటు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.  

‘నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలను కించపరచడం ఎంత మాత్రం నా ఉద్దేశం కాదు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డంలో ఎప్పుడూ నేను ముందు వ‌రుస‌లో ఉంటా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నా’ అని  ముఖేష్ పేర్కొన్నాడు.  

మొత్తానికి మ‌హిళా లోకం తిర‌గ‌బ‌డే స‌రికి …ముఖేశ్ ఖ‌న్నా తోక ముడ‌వాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయాల‌ను నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే ఓ మాట మాట్లాడే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాలని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. 

బాబుగారి ఆటకోసం ఎవ‌రో ఒక‌రు బలి