Advertisement

Advertisement


Home > Politics - National

4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఆవిరి

4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఆవిరి

లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఈ ఏడాది పీడకలగా మారనుంది. ఇప్పటికే లక్షల ఉద్యోగాలు పోయాయి, రాబోయే నెలల్లో మరిన్ని ఉద్యోగులు ఊడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్లంప్ ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.

ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. లే-ఆఫ్స్ పై ట్రాకింగ్ చేస్తున్న ఓ సంస్థ వేసిన అంచనా ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగ్ 695 కంపెనీలు లక్షా 98వేల మంది ఉగ్యోగుల్ని తొలిగించాయట.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1046 టెక్ కంపెనీలు, లక్షా 61వేల మంది ఉద్యోగుల్ని తొలిగించగా..  ఈ ఏడాది ఈ 4 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయి. ఒక్క జనవరి నెల్లోనే దాదాపు లక్ష ఉద్యోగాలు పోయాయి.

అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ ఫోర్స్.. ఇలా ప్రతి టెక్ కంపెనీ ఈ ఏడాది తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మొత్తంగా చూసుకుంటే.. 2022 జనవరి నుంచి ఈనెల వరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 60 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి.

ఇప్పుడీ లిస్ట్ లోకి టెలికాం కంపెనీలు కూడా చేరుతున్నాయి. వోడాఫోన్, బీటీ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని వదిలించుకోవడానికి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకున్నాయి. మరోవైపు ఇతర సంస్థలేవీ.. తమ ఉద్యోగులకు ఈ ఏడాది ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?