ఆన్ లైన్ గేమ్స్.. షాకిచ్చిన అమ్మాయిలు

అబ్బాయిల్ని ఎప్పుడు చూసినా మొబైల్ లో మునిగిపోతారు. ఆన్ లైన్ గేమ్స్ తోనే కాలం గడిపేస్తుంటారు. సాధారణంగా మనందరికీ కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది నిజం కాదు. దేశంలోని ఆన్ లైన్ గేమర్స్…

అబ్బాయిల్ని ఎప్పుడు చూసినా మొబైల్ లో మునిగిపోతారు. ఆన్ లైన్ గేమ్స్ తోనే కాలం గడిపేస్తుంటారు. సాధారణంగా మనందరికీ కనిపించే దృశ్యం ఇది. కానీ ఇది నిజం కాదు. దేశంలోని ఆన్ లైన్ గేమర్స్ లో ఎక్కువమంది మహిళలు కూడా ఉన్నారు. ఓ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది.

దేశంలోని ఆన్ లైన్ గేమర్స్ లో మహిళలే ఎక్కువగా ఉన్నట్టు లుమికాయ్ అనే గేమింగ్ కంపెనీ వెల్లడించింది. 41 శాతం మంది మహిళలు ప్రస్తుతం ఆన్ లైన్ గేమర్స్ గా ఉన్నారని సంస్థ వెల్లడించింది. ఆన్ లైన్ గేమింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది ఈ కంపెనీ.

ఇండియాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్లలో 50శాతం మంది గేమ్స్ ఆడుతున్నట్టు సంస్థ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ సంఖ్య 12 శాతం పెరిగినట్టు వెల్లడించిన కంపెనీ.. ప్రతి వ్యక్తి గేమింగ్ లో గడిపే సమయం 20శాతం పెరిగిందని, వారానికి 10-12 గంటలు అదనంగా గేమ్స్ ఆడుతున్నారని వెల్లడించింది.

ఇండియాలో గేమ్స్ ఆడుతున్న వ్యక్తుల్లో 59శాతం మంది పురుషులైతే, 41శాతం మంది మహిళలున్నారని వెల్లడించింది. వీళ్లలో 18-30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లే ఎక్కువమంది. పైగా గేమర్స్ లో 66శాతం మంది నాన్-మెట్రోల నుంచి ఉండడం గమనార్హం.

చాలామంది రిలాక్స్ అవ్వడానికి, స్నేహితుల్ని పొందడానికి గేమ్స్ ఆడుతున్నట్టు నివేదికలో వెల్లడైంది. ఫ్రీ గేమ్స్ ఆడడంతో పాటు, యాప్ స్టోర్ నుంచి గేమ్స్ కొనుగోలు చేసేవారు గతేడాదితో పోలిస్తే, 50శాతం పెరిగారంట.