తమ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ఉదయం ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం కానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆప్ తన కొంతమంది ఎమ్మెల్యేలను సంప్రదించినా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. వారు మీటింగులకు వస్తారా రారా లేకపోతే బీజేపీకి అందుబాటులోకి వెళ్లారా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాషాయ పార్టీలో చేరేందుకు బీజేపీ తమకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని గతంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల నగదుతో కొనడానికి ఆప్ తప్పుబడుతోంది.