Advertisement

Advertisement


Home > Politics - National

టిక్ టాక్ పై నిషేధ బిల్లుకు వైట్ హౌస్ ఆమోదముద్ర..!

టిక్ టాక్ పై నిషేధ బిల్లుకు వైట్ హౌస్ ఆమోదముద్ర..!

చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు అమెరికా ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తోంది. మొదటగా అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లలో టిక్ టాక్ ఉపయోగించడానికి వీలు లేదని ప్రకటించింది అమెరికా. ఇప్పుడు పూర్తిగా టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు సిద్ధం చేసిన బిల్లుకి వైట్ హౌస్ ఆమోదం తెలిపింది. ఈమేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సీనియర్ సెనేటర్లు మార్క్ వార్నర్, జాన్ థూన్.. ఈ బిల్లు ప్రవేశ పెట్టగా చట్టసభ సభ్యులు మద్దతు తెలిపారు. “రిస్ట్రిక్టింగ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ దట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ యాక్ట్‌” పేరుతో దీన్ని అమలులోకి తెస్తున్నారు. టిక్ టాక్ పై నిషేధమే కాకుండా, కొన్ని ఇతర దేశాల సాంకేతిక సేవలు వినియోగించుకోకుండా నిరోధించడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి ఈ చట్టం అధికారాన్నిస్తుంది. అమెరికన్ల డేటా, జాతీయ భద్రతకు హాని కలిగించే ఎలాంటి టెక్నాలజీని తమ ప్రభుత్వం స్వాగతించదని తెలిపారు సుల్లివన్.

ఈ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో టిక్ టాక్ ద్వారా ఎలాంటి ముప్పు పొంచి ఉంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఎలా నిఘా పెట్టగలరు, వ్యతిరేక ప్రచారాలను ఎలా వ్యాపింపజేస్తారు అనే దానిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఇద్దరు సెనెటర్లు. 

చైనీస్ సంస్థ బైట్ డ్యాన్స్ కి చెందిన టిక్ టాక్ యాప్ కి ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లమంది యూజర్లు ఉన్నారు. ఒక్క అమెరికాలోనే 10కోట్లమంది ఫోన్లలో టిక్ టాక్ వినియోగిస్తున్నారు. 

అయితే టిక్ టాక్ సంస్థ మాత్రం దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛపై అమెరికా దాడిగా అభివర్ణిస్తోంది. అమెరికన్ సంస్కృతి, విలువల విషయంలో ఇది నిరంకుశ చర్యగా తిట్టిపోస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?