శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై ఎన్సీపీ కమిటీ ట్విస్ట్ ఇచ్చింది. ఆయన పార్టీ చీఫ్ గా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. ఆయన రాజీనామా చేస్తామంటే తాము ఒప్పుకోబోమని కమిటీలో సభ్యుడైన ప్రఫుల్ పటేల్ అన్నారు.
ఎన్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పదవీ విరమణపై తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలు, క్యాడర్ని షాక్‌కి గురి చేసింది. పవార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్యాడర్ ఒత్తిడి పెంచింది. స్పందించిన పవార్ పునరాలోచించి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ కుడా ఆయన రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్ పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అజిత్‌పవార్ 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం దృష్టా అజిత్‌ను కాషాయ పార్టీలోకి వెళ్లనివ్వకుండా ఆపేందుకు ఎన్సీపీలో చీలిక ఏర్పడకుడదనే ఉద్దేశ్యంతో శరద్ ఈ నిర్ణయం తీసుకోని ఉంటారని భావిస్తున్నారు.