Advertisement

Advertisement


Home > Politics - National

ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారం

ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారం

నిన్నటితో వాలంటైన్స్ వీక్ పూర్తయింది. మరి ఇవాళ్టి నుంచి ఏంటి? ఇంకేముంది, ఇవాళ్టి నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ అన్నమాట. పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో, ప్రేమ తర్వాత పెటాకుల కోసం ఈ యాంటీ-వాలంటైన వీక్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. యాంటీ-వాలంటైన్ వీక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్.

14వ తేదీ వరకు ప్రేమికులు సంబరాలు చేసుకుంటే, 15వ తేదీ నుంచి, అంటే ఇవాళ్టి నుంచి భగ్నప్రేమికులు సంబరాలు చేసుకుంటారన్నమాట. వాలంటైన్స్ వీక్ లో కిస్ డే, చాక్లెట్ డే, హగ్ డే ఉన్నట్టుగానే.. యాంటీ-వాలంటైన్ వీక్ లో కూడా ఇవాళ్టి నుంచి 7 రోజులకు 7 ప్రత్యేకతలున్నాయి.

ఈరోజు వాలంటైన్స్ వ్యతిరేక వారంలో మొదటి రోజు. భాగస్వామిపై ఉన్న అన్ని పాత పగలు, చిరాకు, పశ్చాత్తాపం వదిలేయడానికి ఈరోజును కేటాయించారు. పాత జ్ఞాపకాలు మరిచిపోయి ముందుకుసాగడానికి ఇది ప్రారంభం అన్నమాట. దీనికి స్లాప్ డే అని పేరు. ఈమధ్య దీన్నే మూవ్-ఆన్ డే అని కూడా పిలుస్తున్నారు.

ఇక ఫిబ్రవరి 16..కిక్ డే. యాంట్ వాలంటైన్ వీక్ లో రెండో రోజు. ఇది కూడా మొదటి రోజు లాంటిదే. ప్రేమ బంధంలో ఉన్న ప్రతికూలతలు, చెడు జ్ఞాపకాల్ని తొలిగించే రోజు. 

యాంటీ వాలంటైన్ వీక్ లో మూడో రోజు.. పెర్ఫ్యూమ్ డే. మనపై మనం ప్రేమను పెంచుకునే రోజు ఈరోజు. మనకు మనమే ఓ అందమైన బహుమతి లేదా పెర్ఫ్యూమ్ ను బహుమతిగా ఇచ్చుకోవాలి. 

ఇక నాలుగో రోజును ఫ్లర్టింగ్ డే, ఐదో రోజును కన్ఫెషన్ డే, ఆరో రోజును మిస్సింగ్ డే అని పిలుస్తారు. ఇక కీలకమైన ఏడో రోజుకు బ్రేకప్ డే అని పెట్టారు. ఈ 6 రోజుల ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత, ఏడో రోజు, అంటే ఫిబ్రవరి 21న తమ మాజీ భాగస్వామికి శాశ్వతంగా బ్రేకప్ చెప్పడం అన్నమాట. దీంతో యాంటీ-వాలంటైన్ డే ప్రహసనం పూర్తవుతుంది. 

ఫిబ్రవరి 14న కొంతమంది తమ ప్రేమను సాధించుకుంటే, మరికొంతమంది అదే రోజు తిరస్కరణకు కూడా గురవుతారు. అలాంటి వాళ్లంతా ఫిబ్రవరి 15 నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ ను ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?