థాయ్ లాండ్ లో కాల్పుల క‌ల‌క‌లం!

థాయ్లాండ్‌లో దారుణం జ‌రిగింది. థాయ్లాండ్‌లోని ప్రీ-స్కూల్ డేకేర్ సెంట‌ర్ లో తుపాకీ దాడిలో ఒక మాజీ పోలీసు అధికారి 34 మందిని చంపారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. నాంగ్ బూలవా లాంఫు…

థాయ్లాండ్‌లో దారుణం జ‌రిగింది. థాయ్లాండ్‌లోని ప్రీ-స్కూల్ డేకేర్ సెంట‌ర్ లో తుపాకీ దాడిలో ఒక మాజీ పోలీసు అధికారి 34 మందిని చంపారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. నాంగ్ బూలవా లాంఫు ప్రావిన్స్ లోని డేకేర్ సెంట‌ర్ లో దాడి అనంత‌రం దుండ‌గుడు త‌న కుటుంబ స‌భ్యుల‌ను హ‌త్య చేయ‌డంతో పాటు త‌న‌ను త‌ను కాల్చుకున్న‌ట్లు స‌మాచారం.

34 ఏళ్ల ఈ మాజీ పొలీసు అధికారి డ్ర‌గ్స్ కేసులో గ‌త ఏడాది ఉద్యోగం నుండి తొల‌గించ‌బడ్డార‌ని పోలీసులు తెలిపారు. ప్రీ-స్కూల్ డేకేర్ సెంట‌ర్లో జ‌రిపిన దాడిలో చాల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని మృతుల సంఖ్య ఇంక పెర‌గ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

ఎప్పుడు ప్ర‌శాంతంగా ఉండే థాయ్లాండ్‌ లో ఇలాంటి కాల్పుల ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం అరుద‌ని. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్ధాయి విచార‌ణ‌కు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆగ్నేయాసియాలో తుపాకీ సంబంధిత మరణాల రేటు అత్యధికంగా థాయిలాండ్‌లో ఉంది.