భారత్ కూడా శ్రీలంక యేనా బాబూ?

గత కొన్నాళ్లుగా చంద్రబాబు అండ్ కో, అలాగే ఆయన సామాజిక మీడియా ఒకటే టముకేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కూడా శ్రీలంక మాదిరిగా అయిపోతుందని ప్రచారం సాగిస్తున్నాయి.  Advertisement పెరుగుతున్న అప్పులను దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నాయి.…

గత కొన్నాళ్లుగా చంద్రబాబు అండ్ కో, అలాగే ఆయన సామాజిక మీడియా ఒకటే టముకేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కూడా శ్రీలంక మాదిరిగా అయిపోతుందని ప్రచారం సాగిస్తున్నాయి. 

పెరుగుతున్న అప్పులను దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి ఇక్కడ ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తున్నాయి. కానీ గమ్మత్తేమిటంటే ఈ రోజు నేషనల్ మీడియా ఓ సంగతి వెల్లడించింది.

పెట్రోలు, గ్యాస్ రేట్లు తగ్గించడం వల్ల కేంద్రంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందట. దాన్ని భరించే శక్తి లేక అప్పు చేయాలని కేంద్రం భావిస్తోందట. అయితే ఆ అప్పు ఎంత అంటే…13 బిలియన్ డాలర్లు…దీన్ని మన రూపాయల్లోకి మార్చుకుంటే కళ్లు జిగేల్ మంటాయేమో? రూపాయల్లోకి మార్చుకుంటే వచ్చే అంకె ఇలా వుంటుంది.…10,11,64,18,00,000.

మరి ఇంత అప్పు కేంద్రం చేస్తోంది అంటే మరి దేశం పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కేంద్రం కూడా తనకు తోచిన అప్పులు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ కొత్త అప్పు. మరి ఇప్పుడు చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ దీని మీద కూడా మాట్లాడాలి కదా. 

దేశాన్ని శ్రీలంక చేస్తున్నారని మోడీ మీద విరుచుకు పడాలి కదా? కానీ ఆ ప్రయత్నం చేయమన్నా చేయరు…కాదు కాదు..చేయలేరు. ఎందుకంటే అక్కడ వున్నది మోడీ.