Advertisement

Advertisement


Home > Politics - National

సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?

సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?

సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో అడుగుపెట్టే సందర్భం ఆసన్నం అయినట్టే. సోనియా, ప్రియాంక ఇద్దరిలో ఎవరు ఓకే చెబితే వారిని తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ ప్రకటించేశారు. ఇప్పుడు బంతి తల్లీకూతుళ్ల కోర్టులోకి వచ్చింది. వారు ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిని బట్టి.. ఎవరో ఒకరు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశం ఉంది.

హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ రాజకీయ బలాబలాలు ప్రస్తుతం వేరుగా ఉన్నాయి. 68 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ కు 40 మంది సభ్యుల బలం ఉంది. స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ ఈ సీటును దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తల్లీకూతుళ్లకు ఈ బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది.

సోనియా గాంధీ కుటుంబం రాజ్యసభ ఎంపీలుగా.. ఈజీ వేలో సభాప్రవేశం చేయడానికి సుముఖంగా ఉన్నారా? దేశాన్ని ఏలే కుటుంబంగా గుర్తింపు ఉన్న వీరికి ప్రజల్లోంచి గెలిచే ఉద్దేశం లేదా అనేది ఒక కీలకమైన సంగతి.

అయితే, తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. ఇక్కడినుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా సోనియాగాంధీని రాష్ట్ర కాంగ్రెస్ ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను ఇక్కడినుంచి గెలిపించి ఎంపీ పదవిని ఆమెకు కానుకగా ఇస్తాం అని వారు గతంలో ప్రకటించారు.

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగి కష్టపడడానికి, చాన్సెస్ తీసుకోవడానికి సోనియా సిద్ధంగా ఉన్నారా? ఈజీ మార్గంలో రాజ్యసభ రూపంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారా అనేది ఇంకా తేలలేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు మూడు రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో రెండింటిని ఖచ్చితంగా కాంగ్రెస్ దక్కించుకోగల బలంతో ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సీటు ఆఫర్ చేస్తే సోనియా స్వీకరించవచ్చునేమో అనే భావన కూడా పలువురిలో కలుగుతోంది.

అదే జరిగితే.. తెలంగాణ నుంచి సోనియా, హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రియాంక రాజ్యసభ ఎంపీలు అవుతారు. గత లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీచేసి ఒక చోట ఓడిపోయిన రాహుల్ గాంధీ ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల్లోనే తన అదృష్టాన్ని ప్రజాబలాన్ని పరీక్షించుకుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?