హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని హోంగార్డుల నుండి ఇన్స్‌పెక్టర్ వరకు మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. ఇందులో కొంత మందిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు విషయంలో స్టేషన్ సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల అతను దేశం విడిచి వెళ్లడంతో పాటు.. ఇటీవల ఓ హోటల్ గొడవ విషయంలో కూడా ఆ స్టేషన్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో పెద్ద ఎత్తున్న అక్కడి సిబ్బందిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు రావడంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దానితో పాటు ప్రజా భవన్ కూడా పంజాగుట్ట పరిధిలో ఉండటంతో అక్కడికి వచ్చే బాధితుల వివరాలు కూడా మాజీ ప్రభుత్వ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా దేశ చరిత్రలో ఒకే అర్డర్ కాపీతో స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం ఇదే మొదటి సారి కావడం గమన్హారం.