24 ఏళ్లలో ఇదే అతిపెద్ద దుర్ఘటన

కమాండ్ కంట్రోల్ తప్పిదం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రకటించి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

అమెరికాలో చరిత్రలోనే ఈ 24 ఏళ్లలో అతిపెద్ద దుర్ఘటనగా నిలిచింది వాషింగ్టన్ విమాన ప్రమాదం. ఒక ప్రయాణికుల విమానం, ఓ సైనిక హెలికాప్టర్ గాల్లోనే పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

అమెరికా కాలమానం ప్రకారం, బుధవారం రాత్రి 8 గంటల 47 నిమిషాలకు వాషింగ్టన్ లోని రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం, సరిగ్గా ల్యాండింగ్ కు కొన్ని క్షణాల ముందు ఆర్మీ హెలికాప్టర్ ను ఢీకొచ్చింది.

దుర్ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఇక హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులున్నారు. వీళ్లంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఢీకొన్న తర్వాత పోటోమాక్ నదిలో రెండూ కూలిపోయాయి. విమానం 2 ముక్కలవ్వగా, వెనకభాగం నిలువుగా నదిలో కూరుకుపోగా.. హెలికాప్టర్ రివర్స్ లో నదిలో మునిగిపోయింది. దీనికితోడు ఘటన జరిగిన సమాయంలో నదిలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఎవ్వరూ బతికే అవకాశం లేదంటున్నారు. ఇప్పటివరకు 30 మృతదేహాల్ని వెలికితీశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఘటనపై వెంటనే స్పందించిన అధ్యక్షుడు ట్రంప్, కమాండ్ కంట్రోల్ తప్పిదం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రకటించి, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

6 Replies to “24 ఏళ్లలో ఇదే అతిపెద్ద దుర్ఘటన”

  1. roja అక్క కానీ భారతి అక్కి కానీ అమెరికా వెళ్ళారా , కుంబ మేళా కు వెళ్లారు 40 మందిని పొట్టను పెట్టుకున్నారు, అమెరికా వచ్చారు 70 మందిని పొట్టను పెట్టుకున్నరూ , ఐరన్ లెగ్ మహిమ.

Comments are closed.