అమెరికా జీవితం భారతీయ యువతకి చాలా సామాన్యంగా మారిన కల. ఒకప్పుడు ధనిక కుటుంబాలకి, బాగా మెరిట్ ఉన్న విద్యార్థులకి మాత్రమే పరిమితమైన ఈ కల క్రమంగా మధ్యతరగతి కుటుంబాల్లోని యావరేజ్, బిలో యావరేజ్ విద్యార్థులకు కూడా కామనైపోయింది.
అకడెమిక్ స్కోర్ ఎలా ఉన్నా జీ.ఆర్.ఈ, టోఫెల్ వంటివి రాయడానికి బయలుదేరుతున్నారు. చాలామంది సక్రమంగానే రాస్తున్నా, పరీక్ష ఆ ఎగ్జాంస్ రాయడానికి ప్రాక్సీని ఏర్పాటు చేసే అక్రమ పద్ధతులు కూడా ఉన్నాయి. ఎలాగో అలా బేసిక్ అర్హత సంపాదించి యూనివర్సిటీలకి అప్లై చేస్తే అమెరికాలో ఉన్న వేలాది విద్యాలయాల్లో ఎక్కడో అక్కడ సీట్ దొరికేస్తుంది. ఆదాయం కోసం అలా ఇచ్చేస్తున్నారు.
ఇక ఫీజ్ కట్టి ఆ అడ్మిషన్ ని పూర్తి చేయాలి. దానికి బ్యాంకులు లోన్లిస్తున్నాయి. ఉన్న చిన్న ఇల్లో, పొలమో ష్యూరిటీ గా తీస్కుని ఎన్నో భారతీయ బ్యాంకులు ఆ అమెరికన్ యూనివర్సిటీలకి ఫీజులు కడుతున్నాయి. ఫీజ్ ఖర్చు ప్రస్తుతానికి అలా గట్టెక్కుతుంది కనుక, ఇక అక్కడ బతకడానికి డబ్బు కావాలి. ఇన్నాళ్లూ అందరికీ తెలిసిన విధానం ఏంటంటే పార్ట్ టైం జాబులు చేసుకుని బతికేయొచ్చు అని. కానీ విద్యార్థిగా ఉన్న విదేశీయులు అమెరికాలో ఏ విధయమైన పార్ట్ టైం ఉద్యోగాలు చేయకూడదు. చేస్తే నేరం. చిత్రమేంటంటే ఈ విషయం నూటికి 90 శాతం మందికి తెలీదు. ఇన్నేళ్లూ ఏ భారతీయ విద్యార్థులైనా అలానే బతికారు.
మరి నేరమైతే ఎందుకు పట్టుకోలేదు ఇన్నేళ్లు అని అడోగొచ్చు. దానికి కారణం ప్రభుత్వాలు లిబరల్ గా ఉండడమే. “లిబరల్” వేరు “లీగల్” వేరు. ఇల్లీగల్ అయినప్పటికీ చూసీ చూడనట్టు వదిలేయడం, తెలిసినా పట్టించుకోకపోవడం “లిబరల్”. అంటే ఏ ప్రభుత్వమైనా సీరియస్ గా తీసుకుని లిబరల్ కాకుండా ఉంటే శిక్షలు, వెనక్కి పంపడాలు ఉండొచ్చు. ఇన్నాళ్లూ లేని ఆ స్థితి ఇప్పుడు ట్రంప్ హయాములో మొదలయింది.
విదేశాలనుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థులలాగానే ఉండాలి; ఉద్యోగాలు చేసినట్టు కనిపిస్తే వెనక్కి పంపేస్తానంటున్నాడు ట్రంప్. దాంతో పాపం ఒక్కసారిగా చాలామంది భారతీయ విద్యార్థులు చేస్తున్న పనులు మానేసి కూర్చున్నారు. మానేస్తే గడవడం ఎలా? చేసేదేముంది..ఇంటి నుంచి పంపమని చెప్పాలి? పంపడమంటే ఎంత? కనీసం నెలకి లక్షో, లక్షన్నరో పంపిస్తే తప్ప గడవదు. అంత స్తోమత అందరికీ ఎక్కడుంటుంది? అదే ఇప్పుడు పెను సమస్య.
ఈ విషయం మీద కొంతమంది తల్లిదండ్రులతోనూ, అమెరికాలోని తెలుగు విద్యార్థులతోనూ మాట్లాడితే వారి పరిస్థితి చెప్పుకున్నారు.
హైదరాబాదులోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే శివకుమార్ (పేరు మార్చబడింది) కి నెలకి రూ 80,000 జీతం. ఊళ్లో నాలుగెకరాల పొలం ఉంది. కొడుకు నవీన్ ని ఇంజనీరింగ్ చదివించారు. మెరిట్ లో పాసయ్యాడు. జీ.ఆర్.ఈ, టొఫెల్ స్కోర్లు కూడా బాగా వచ్చాయి. మంచి యూనివర్సిటీలో చేరాడు నవీన్. ఒక రెస్టారెంట్లోనూ, చిన్న స్టోర్లోనూ పార్ట్ టైం పని చేస్తూ దాదాపు సగం లోన్ కూడా తీర్చేసాడు. ప్రస్తుతం ఎమ్మెస్ పూర్తి చేసి ఓపీటీ మీద ఉన్నాడు. ఇంకా హెచ్ 1బి రాలేదు. ఉద్యోగం వస్తే సరి. లేకపోతే మిగిలిన లొన్ తీర్చకుండానే వెనక్కి రావాల్సిన పరిస్థితి. అలా వస్తే ఎడ్యుకేషన్ లోన్ కోసం ష్యూరిటీగా పెట్టిన పొలాన్ని కోల్పోవాల్సి వస్తుందనేది శివకుమార్ బెంగ.
ఇదే విషయమై నవీన్ తో మాట్లాడితే, “ఇక్కడ ట్యాలెంట్ కే ప్రాధాన్యం అంటారు కానీ, అదంతా ఉత్తిది. అక్రమ మార్గాల్లో ప్రాక్సీలని పెట్టుకుని ఇంటర్వ్యూలు చేయించుకోవడం, ఫేక్ గ్రీన్ కార్డ్ సంపాదించి ఉండిపోవడం లాంటి పనులు చేసే వాళ్లే ఇక్కడ ఈజీగా సెటిలౌతున్నారు. అలా చేయడం నేరం. పట్టుకుంటే శిక్ష ఉంటుంది. అయినా చేస్తున్నారు. నాకున్న భయానికి ఆ దిశగా వెళ్లలేను. మరో ఆర్నెల్లు గడువుంది. దేవుడు కరుణిస్తే సరే. లేకపోతే ఇంటికే”, అన్నాడు దీనంగా.
ఇది ఒక్క శివకుమార్, నవీన్ ల కథ కాదు. ఎందరిదో ఇదే కథ.
రామారావు (పేరు మార్చబడింది) అనే జర్నలిస్టు కొడుకు ప్రకాష్. ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ లో మంచి ఐటీ జాబ్ సంపాదించాడు. అయినా ప్రకాష్ టెంప్ట్ అయ్యి ఇక్కడ జాబ్ మానేసి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఇన్నాళ్లూ పార్ట్ టైం జాబ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంటి నుంచి బంగారం తాకట్టు పెట్టి నెలకి లక్ష పంపిస్తున్నారు. ఇలాంటి కథలు అనేకం.
మరొక ఉదాహరణ. శాంతి (పేరు మార్చబడింది) ఒక మధ్య తరగతి అమ్మాయి. తండ్రికి ఉద్యోగం లేదు, తల్లి ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్. శాంతి మెరిట్ స్టూడెంట్ కనుక అమెరికా చదువుకి ఆశపడింది. తల్లిదండ్రులకి కష్టమైనా పిత్రార్జితమైన ఒక్కగానొక్క చిన్న ఇంటిని ష్యూరిటీ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని శాంతిని అమెరికాకి పంపాడు తండ్రి. ఆ పంపడంలో విమానం టికెట్ నిమిత్తం, చేతి ఖర్చుల నిమిత్తం సమీప బంధువులు సాయం చేసారు. శాంతి యూనివర్సిటీలో చేరి, ఏ పార్ట్ టైం జాబ్ దొరక్క, తనకి వంట చేయడం బాగా వచ్చు కనుక ఒక గుజరాతీల ఇంట్లో వంట చేస్తోంది. మరొక భారతీయుల ఇంట్లో ఇంటి పనులు కూడా చేస్తోంది. గంటకి పది-పన్నెండు డాలర్లు సంపాదించుకుంటోంది. ఇప్పుడామెకి భయం పట్టుకుంది. ఆ పని మానేస్తే ఇంటి నుంచి తనకి డబ్బు పంపే పరిస్థితి లేదు. అలాగని పని కొనసాగించాలా అంటే పట్టుకుంటారేమో భయం. ఈ సందిగ్ధంలో ఆమెకి కొందరు బంధువులు ప్రస్తుతం ఒక నెల సాయంగా తలో కాస్తా వేసుకుని లక్ష వరకు పంపారు. మరో నెల పంపుతారా అంటే తెలీదు. తీరా అమె యూనివర్సిటీలో చేరి ఏడాది అయ్యిందంతే. ఇన్నాళ్లూ తన మెయింటెనెన్స్ అయ్యింది తప్ప బ్యాంక్ లోన్ కాస్త కూడా కదల్లేదు. ఇలాంటి గాధలు ఎన్నో.
అధ్యక్షుడు ట్రంప్ ఆరాటం, ఆర్భాటం బాగానే ఉన్నాయి కానీ ఆయన ఫోకస్ పెట్టాల్సిన అతి పెద్ద ఏరియా ఇల్లీగల్ కన్సెల్టెన్సీలు. పైన చెప్పుకున్న దాంట్లో నవీన్ వంటి ప్రతిభావంతులకి చాన్స్ ఇవ్వకుండా ఫేక్ గాళ్లు చాలామంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఆ విధానాలకి ఇల్లీగల్ కన్సెల్టెన్సీలు నడుపుతున్న ముఠాలున్నారు. వాళ్లని పట్టుకోవాలి కదా!
“అమెరికా ఫస్ట్” నినాదంతో సిటిజెన్లకి ఉద్యోగాలివ్వాలనుకోవడం ఒకెత్తు; ఆ పైన ప్రతిభావంతులైన ఫారినర్స్ కి హెచ్ 1 బి ఇచ్చి ఉద్యోగాల్లోకి పిలవడం మరొక ఎత్తు. కానీ ఇక్కడ ప్రతిభావంతుల్ని అడ్డుకుని ఫేక్ గాళ్లు లైన్ బ్రేక్ చేస్తుంటే ట్రంప్ పట్టించుకోడా? అమెరికా వ్యవస్థని, హెచ్ 1 బి విలువని దిగజార్చే ఆ ముఠాలని అతిపెద్ద నేరస్థులుగా పరిగణించి గ్వాంటనమో జైలుకి పంపిస్తానని ప్రకటించొద్దా? అలా ప్రకటించేలా ఆయనకి విషయాన్ని అందజేయొద్దా? ఆ దిశగా కూడా అక్కడున్న మనవాళ్లు ఆలోచించాలి.
హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసినవాళ్ళల్లో 26% మందికి ఉద్యోగాలు రాలేదట. దానికి కారణం టెక్ కంపెనీలకి ఎంబీయేల అవసరం తగ్గడం అని చెప్తున్నారు. అది సరే..మరి టాప్ యూనివర్సిటీలనుంచి టాప్ స్కోర్ తో ఎమ్మెస్ పూర్తి చేసి ఇంకా హెచ్ 1 బి రాని నవీన్ లాంటి వాళ్లు కోకొల్లలు ఉన్నారు అమెరికాలో. శాంతి లాంటి మెరిట్ విద్యార్థునులకి ఉద్యోగమొస్తుందా అంటే తెలీదు. మరి వస్తున్న ఉద్యోగాలు ఎవరికి? యావరేజ్ వాళ్లు, వెనకబడ్డ యూనివర్సిటీల నుంచి డిగ్రీ పొందిన వాళ్లు కూడా అక్రమమార్గాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఇల్లీగల్ కన్సెల్టెన్సీలని ఆశ్రయించి.
ఇన్ని అడ్డంకులు దాటుకుని నిఖార్సైన విద్యార్థులు అమెరికాలో ఉద్యోగం పొందడం ఎంత కలో ఆలోచించాలి. అమెరికాకి వెళ్లాలనుకోవడం ఎంత కలో, అక్కడ సెటిలవ్వాలనుకునే ప్రయత్నాలన్నీ రోజుకో పీడకలగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకి ఆందోలణ, ఇండియాలో తెల్లిదండ్రులకి బీపీలు, షుగర్లు. ఈ వాతారవరణాన్ని తెలుసుకునైనా అమెరికా కలలు గనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి.
పద్మజ అవిర్నేని
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పద్మజ గారికి చిటికెలు. మీ H4 EAD సంగతులు కూడ చెప్పండి.
My son completed Bachelors degree in US University in Jun 2024, no job till now, I know at least 5 students from India, used fake green card and proxy doing jobs here. Our Indian consultancy on promote this fake culture, and force to put fake certifications, university degrees, and experience.
Its rampant, and dangerous, now many companies black listing Indians because we put so much fake, and companies no longer interested to recruit Indians. We are ruining our fame with fake culture.
.
I understand your pain sir. I understand your son’s situation. My friend also facing the same similar issue. His contract was not extended because of a couple of fake GC students joined. And the funny thing is they are working on multiple jobs including a store.
How it is possible to get a fake GC. Wherever they go, it can be caught with national database na?
They don’t use to travel to get caught. The end client do not vet the GC. The end client contracts with the prime vendor for work. The prime has contract with subvendor consultancies. The consultancies are the rocketeers.
Hard to believe such scams in the high tech corporate world. What happened to their ethics? These need to be exposed.
No ethics, just survival. I know few Indian kids who use to work in restaurants put a fake GC and CV and using a proxy got a job. Companies prefer such candidates because their bill rate is very low (some times like $20 / hour ), room sharing, working part time in restaurant make it workable for them.
.
To be precise, consultancies owned by our own Telugu population do lot of illegal activities while securing roles/projects
అమెరికా అవకాశాలు దేశం కదా. అబ్బాయి దగ్గర ఎదగాలి ఆన్న కసి, నేర్చుకోవాలి ఆన్న ఆత్రం వుంటే , తప్పని సరిగా ఏదో ఒక అవకాశం దొరుకుతుంది.
ఒరాకిల్ వాళ్ళు ఏదో పెద్ద డేటా సెంటర్ మొదలు పెట్టబోతున్నారు అని రాస్తున్నారు , అందులో మీ అబ్బాయికి ఉద్యోగం రావాలని కోరుకుందాం. శుభం.
వేరే వాళ్ళ వలన మనం యెదగలేక పొయం, లేకపోతేననా అనే పాత కాలం ఆలోచన ఇప్పుడిక చెల్లదు. బతకాలి అంటే అక్కడి సాధారణ ఆమెకన్ లాగానే దొరికిన పని చిన్నది, పెద్దది అనేది తేడా లేకుండా చేస్తూ, పెద్ద అవకాశం కోసం ట్రై చేస్తూ వుండటమే.
may be true but this kind of blaming others attitude wont help. its dog eat dog world today
Indian students are working as rogues in US…they are working using fake green cards or using someone else green cards and working..indian students are making india name as worst with their frauds …all because of ysr and ys jagan worthless idiots joined btech and completes copying using free education
అందరికీ రాజు గారు లాంటి దాత దొరకడు కదా!
బ్రిటిష్ కాలం నుంచి మొదలైన ఈ తెల్ల చాకిరీ ఎల్లలు దాటించిన ఘనత మన తెలుగువారిదే అన్న మాట!
కాంపస్ ఉద్యోగాలొచ్చినా,ఇక్కడుండటం నామోషీ అనుకుని పిల్లల్ని అమెరికా కు తరిమిన తల్లిదండ్రులకు కనువిప్పు కావాలి.
శ్వేత జాతి వారు ఆ దేశాలని ఆక్రమించి మొత్తం ప్రజలని ఊచకోత కోసి.. ఇప్పుడు అదే ప్రజలకి సంకెళ్ళు వేస్తున్నారు…
Yeah, each student doing illegal jobs and that to 2 to 5 jobs and everybody says GC. The genuine abcd kids facing the problems in getting jobs.
All this operation against students will impact first with universities. No new students will be interested starting the next semister. Housing will see low occupancy and rentals in the university cities will go down. Small businesses that employed the Indian students illegally will not find cheap labor. They have to pay higher for locals. All this will result in lower economic activity in American society. Airlines could also suffer with low demand for air tickets. As for H1B guys it will definitely be a challenging time. Many corporates are cutting jobs irrespective of their visa status already. Several citizens are jobless. Emploers looking to sponsor H1b visas maybe asked to take locals and train them. All fingers crossed this will likely hit the economy while the new adminstartion aggressively working on tariffs. Impacted nations could also retaliate. All this will be an huge economic mess sooner than later.
Is this like certain states in india live literally on liquor income and still talk about welfare or bring new brands or reduce prices and pose like war heros?
Nothing affects US. They are smart enough to figure out. If they are not smart and developed all these beggars wouldn’t have queued for studies and jobs. They don’t do fraud and hence they are not getting jobs and are therefore given to H1B which are mostly fraud
Nothing, US is smart enough to figure out! Exploiters game over so pack bags and board the ship
తెల్లవాళ్లు పరమ సోమరిపోతులు. ఈ పనులు చెయ్యటానికి రారు.
TCS and its suppliers highly involved in these fake GC rockets and jobs.
అంత సీన్ లేదు. ఫేక్ జిసి లు కంపెనీలు చెయ్యవు. దొరికితే మొత్తం మూసి వేసుకోవాలి. ఓన్లీ కన్సల్టెన్సీలు చేస్తాయి ఈ పని.
Here the suppliers are the consulting companies. TCS encouraging these suppliers. It will not vet if it is fake GC or genuine GC. TCS pays the consultancy. It is the understanding between the TCS and consultancies.
Australia and New Zealand are the better for students Now.
Australia is racist. NZ lo options takkuva enka consultancies start avvaledu
Go to UK and Canada. Simple.
2 be begging countries
దేశం. మెజారిటీ
కెనడా: ఖలిస్తాన
యుకె: అరబ్బు ముస్లిం
కొన్నాళ్ళు పోతే యుకె నీ అరబ్బు దేశం వాళ్ళు కొనేస్తారు అని అంటున్నారు.
ముందుగా తమ ముస్లిం లని అక్కడికి పంపి, అక్కడ ముస్లిం జనాభా నీ విపరీతంగా పెంచేసి వున్నారు.
ట్రంప్ తాత ప్రమాణ స్వీకారం తర్వాత…మన తెలుగు వల్ల ఓవర్ యాక్టింగ్ హోమ్ టూర్స్, అందాల ఆడబొమ్మ డ్యాన్సులు, వెకిలి భార్యాభర్త లా వీడియోస్, అసలు మేము ఇండియన్ ఎన్నడూ చూడలేదు అన్నట్లు ఇండియాలో ఉండే వాళ్ళకు ఏమి తెలియదు అన్నట్లు అమెరికా లో ఇది. అలా, అది ఇలా అని చెప్పే వీడియోస్ తగ్గాయి యూట్యూబ్ లో , Instagram lo…next year బతుకమ్మ,yellamma, durgama, kamma heor la cycle rally chestey Trump that’s gudda pagala dengi pampisthadu
Biden time lo telugu valla overacting USA videos, reels chusi chiraku vesedi..Trump oath tarvatha, aa chettha videos gola taggindi
Adi Edupu ani netizens talk
Mari COVID lantivi vastey mammalni india govt aadukovali ani edavakudadu , so called H1B banisalu
Issue with few of North American countries.Nothing to worry.All is well in 6 months.Doing part time jobs don’t bother them rather staying illegally!
పద్దూ అక్క కి పండగే , అక్కడ తెలుగు వాళ్ళకి కష్టం అంటే.
ఇన్నాళ్లు అందరూ ఇక్కడ అమెరికా కి వచ్చేసి బాగుపడిపోతుననారు అని బావురు మనేవారు.
ఇప్పుడు వాళ్ళకి కష్టం, నష్టం అంటే గ్రేట్ ఆంద్ర కి పండగే పండగ.
మీకే ఇంత కుళ్ళు కడుపుమంట ఉంటే , ఇంక అమెరికా వాళ్ళకి ఉండటం మాములే . ఎవరన్నా బాగుపడితే మనం చూస్తూవుండలేముగా .
Come back to kammaravati, here bolli “ sampada srushting “

harward loo vaallu job cheyyataaniki choodaru …job lu iche company lu start chestaaru ..burra takkuva raatalu