ఈసారైనా? పిఠాపురం వర్మకు అదృష్టం దక్కుతుందా?

పిఠాపురం వర్మ.. పవన్ కల్యాణ్ కోసం తనకు దక్కగల అవకాశాన్ని వదులుకున్న త్యాగమూర్తిగా మాత్రమే మిగిలిపోతారా?

పిఠాపురం వర్మ.. పవన్ కల్యాణ్ కోసం తనకు దక్కగల అవకాశాన్ని వదులుకున్న త్యాగమూర్తిగా మాత్రమే మిగిలిపోతారా? లేదా, కనీసం ఈసారైనా చట్టసభలో అడుగుపెడతారా? అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో విస్తృతంగా నడుస్తోంది.

పిఠాపురం వర్మకు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోతే గనుక.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీని కాపాడుకుంటూ.. పార్టీని బలోపేతం చేయడానికి పరిశ్రమించే చిత్తశుద్ధితో పనిచేసేవారికి ఆత్మస్థైర్యం సన్నిగిల్లిపోతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

జగన్ పరిపాలన సాగిన రోజుల్లో రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం కొంత నిస్తేజంగా మారినప్పటికీ.. పిఠాపురంలో నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన రికార్డు పిఠాపురం వర్మకు ఉంది. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గుతాననే విశ్వాసంతోనే ఆయన పనిచేసుకుంటూ పోయారు. అయితే.. జనసేనతో పొత్తులు చాలా కాలం కిందటే కుదిరినప్పటికీ.. పవన్ కల్యాణ్ తాను పోటీచేసే స్థానాన్ని చిట్టచివరి వరకు ప్రకటించకుండా.. నాన్చారు. చివరి నిమిషాల్లో పిఠాపురం నుంచి పోటీచేస్తానంటూ.. వర్మకు షాక్ ఇచ్చారు.

హతాశుడైన ఆయన ఇండిపెండెంటుగా బరిలోకి దిగడానికి అంతా సిద్ధం చేసుకున్నారు కూడా. స్వతంత్రంగా గెలిచి.. చంద్రబాబుకు ఈ సీటును కానుకగా ఇస్తానని ప్రకటించారు కూడా. అయితే చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేయకుండా చంద్రబాబునాయుడు బుజ్జగించారు. పార్టీ విస్తృతప్రయోజనల దృష్ట్యా పవన్ కల్యాణ్ తో పొత్తు అవసరాన్ని వివరించి.. ఆయన వెనక్కు తగ్గేలా, పవన్ కోసం పనిచేసేలా చేశారు. ఆ సమయంలో.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దక్కే మొట్టమొదటి ఎమ్మెల్సీ అవకాశం వర్మకే ఇస్తానని మాట ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది.

ఎన్డీయే సర్కారు ఏర్పడిన తర్వాత ఇప్పటికి అనేక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. కానీ ఏ జాబితాలో కూడా వర్మకు మాత్రం అవకాశం దక్కలేదు. ప్రతిసారీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వర్మ చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో వర్మకు అవకాశం ఇస్తారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.

ఈసారి కూడా వర్మకు అవకాశం ఇవ్వకపోతే గనుక.. కష్టపడి పనిచేసే కార్యకర్తల్లో విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. పార్టీ అధినేత ఈ సత్యాన్ని గుర్తిస్తారో లేదో మరి!

16 Replies to “ఈసారైనా? పిఠాపురం వర్మకు అదృష్టం దక్కుతుందా?”

  1. ఏమ్మెల్సీ ఇచ్చి వేరొక పవర్ సెంటర్ తయారు చేసి తన గొయ్యి తానే తవ్వుకునే వెర్రోడు ఎవరూ ఉండరు రాజకీయ౦లో . ఇక ఇచ్చారు అంటే ఎర్త్ పెట్టడం మొదలుపెట్టినట్టే సిట్టింగ్ కి

    1. 🚨 JAGAN MOHAN REDDY GARU – FROM LEADER TO VOTE-BANK TRADER! YOUR CASTE POLITICS & RELIGIOUS DRAMA HAVE BACKFIRED! 🤡🚨

      Jagan Garu, 11/175 is not just a defeat – it is a REJECTION of your failed leadership! You thought vote bank politics, caste division, and religious manipulation would secure your power forever. But the people are no longer blind! They saw through your tricks, and they have completely rejected you. No more fooling them with freebies, fake promises, and staged religious acts.

      One day you visit temples and pretend to be a Hindu devotee, the next day you play the victim card at Christian meetings. One day you perform pujas, the next day you hold a Bible. This religious flip-flopping for votes has become your identity! Nobody cares about your personal beliefs, but when you use religion as a political tool, you lose respect. Faith is not a shortcut to votes, and people are DONE with your drama!

      Your caste-based political strategy was a disaster. You thought attacking Kapu and Kamma communities would strengthen your vote bank, but instead, you united them AGAINST you! You didn’t consolidate votes – you lost them. You didn’t unite people – you divided them. You didn’t strengthen YSSRCP – you destroyed it from within. Andhra Pradesh was not your personal playground for caste experiments, and now the people have taught you a lesson.

      What Andhra Pradesh truly needs is industries, jobs, infrastructure, and real progress – not false promises, not caste divisions, and definitely not religious gimmicks. Instead of attracting investors, you scared them away. Instead of creating jobs, you made people dependent. Instead of earning respect, you alienated everyone. You had a golden chance to lead, but you wasted it protecting your own interests instead of the state’s future.

      If you continue down this path, YSSRCP will be wiped out, and there will be no one left to save you. The people have moved forward – if you don’t wake up, you will be left behind in history. 🚨

      #WakeUpJagan #StopVoteBankPolitics #PeopleWantDevelopment #EndCasteDivision

  2. వర్మ కి ఇవ్వకపోయినా ఏమీ కాదు కానీ, మావోడికి ఆ “ప్రతిపిచ్చ హోదా” ఇవ్వండియ్యా.. లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదే లే” అంటున్నాడు

  3. వర్మ కి ఇవ్వకపోయినా ఎక్కడికీపోడు’ కానీ, మావోడికి ఆ “ప్రతిపిచ్చ హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

  4. వర్మ కి ఇవ్వకపోయినా ఎక్కడికీపోడు’ కానీ, మావోడికి ఆ “ప్రతిపిచ్చ హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

  5. త్యాగయ్య Vs జెగ్గయ్య

    ‘సీటుదానం చేసిన వర్మ కి ఇవ్వకపోయినా ఎక్కడికీపోడు’ కానీ, మావోడికి ఆ “ప్రతిపిచ్చ హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

  6. ‘మొదట మావోడికి ఆ “ప్రతిపిచ్చ నేత హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

  7. త్యాగయ్య ని ‘వదిలేసి మొదట మా జెగ్గయ్య కి ఆ “ప్రతిపిచ్చ నేత హోదా” ఇవ్వండియ్యా.. ‘లెకపోతే “london నుండి తిరిగి వచ్చేదేలే” అంటున్నాడు

Comments are closed.