కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది రష్మిక. దీంతో ఆమె నటిస్తున్న సికిందర్, కుబేర సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కనీసం మరో 2 వారాల వరకు రష్మిక సెట్స్ పైకొచ్చే ఛాన్స్ లేదు.
అయితే ఆమె ఇంట్లో ఖాళీగా లేదు. కొత్త కథలు వింటోంది. కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగా మరో పెద్ద సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జవాన్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన అట్లీ, తన నెక్ట్స్ ప్రాజెక్టును సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నాడు. ఈ మల్టీస్టారర్ మూవీలో రజనీకాంత్ లేదా కమల్ హాసన్ నటించే అవకాశం ఉంది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు.
యానిమల్, పుష్ప-2 లాంటి పెద్ద సినిమాలతో ఇప్పటికే పాపులరైన రష్మికకు ఇది మరో పెద్ద అవకాశం. ఈ ప్రాజెక్టు లాక్ అయితే, సల్మాన్ తో రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినట్టవుతుంది.
Nakka thokaa thokki vachindi, more offers make distance from VD