కల్కి కంటే లక్కీ భాస్కర్ సూపర్

కోట్లు పెట్టి కొన్న కల్కి లాంటి సినిమాలతో రికవర్ అవ్వడం ఛానెళ్లకు తలకుమించిన భారంగా మారుతోంది.

రెండూ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్టయ్యాయి. కానీ బుల్లితెరపైకి వచ్చేసరికి మాత్రం రిజల్ట్ పూర్తిగా భిన్నం. ప్రభాస్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా, దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ మాత్రం సూపర్ హిట్టయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా లక్కీ భాస్కర్ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 8.48 టీఆర్పీ వచ్చింది. ఓవైపు ఓటీటీలో ఇది టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నప్పటికీ, టీవీలో ఈ సినిమాకు ఆదరణ దక్కడం చెప్పుకోదగ్గ విశేషం.

థియేటర్లలో లక్కీ భాస్కర్ కంటే చాలా పెద్ద విజయం సాధించింది కల్కి. కానీ టీవీల్లో దానికి కేవలం 5.26 రేటింగ్ వచ్చింది. భారీ యాక్షన్ చిత్రాల కంటే.. సాఫ్ట్ మూవీస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకే స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం లక్కీ భాస్కర్ తో మరోసారి ప్రూవ్ అయింది.

శాటిలైట్ ఛానెల్స్ చూసే ప్రేక్షకులు ఏడాదికేడాది తగ్గిపోతూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూట్యూబ్ తో పాటు ఓటీటీలు చూడడం పెరగడంతో శాటిలైట్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ చూడడం తగ్గించేశారు జనం. చూసే కొద్దిపాటి వీక్షకులు కూడా సాఫ్ట్ మూవీస్ చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఛానెళ్లు కూడా సినిమాల శాటిలైట్ రైట్స్ కొనడం తగ్గించేశాయి. కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు తప్పితే, చిన్నాచితకా మూవీస్ కొనడం ఆపేశాయి. భారీగా డబ్బు పెట్టి కొన్ని పెద్ద సినిమాలు కొంటున్నప్పటికీ, 4-5 సార్లు ప్రసారం చేస్తే తప్ప బ్రేక్-ఈవెన్ అవ్వడం లేదు. కోట్లు పెట్టి కొన్న కల్కి లాంటి సినిమాలతో రికవర్ అవ్వడం ఛానెళ్లకు తలకుమించిన భారంగా మారుతోంది.

One Reply to “కల్కి కంటే లక్కీ భాస్కర్ సూపర్”

  1. OTT , no ads and cheap. Satellite Channels, paid channels every month plus advertisements every 10 minutes. Who have the patience to watch 2 hour movie for 4 hours with frequent breaks ??

Comments are closed.