ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ను ఈడీ ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దృష్టి పెట్టింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విచారణకు సంబంధించి సీబీఐ శుక్రవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసాంలో సోదాలు నిర్వహిస్తోంది. సీబీఐ రైడ్‌ను ట్విట్టర్లో ప్రకటించిన మనీష్ సిసోడియా.. త్వరలోనే నిజానిజాలు బయటకు వచ్చేలా విచారణకు సహకరిస్తానని చెప్పారు.
మన దేశంలో మంచి పనులు చేసేవారిని ఇలా వేధించడం దురదృష్టకరమని.. అందుకే మన దేశం ఇంకా నంబర్ 1గా మారలేదని.. ఢిల్లీ సంక్షేమం కోసం తాను చేస్తున్న కృషి ఆగదని భరోసా ఇస్తూ సిసోడియా ట్వీట్ చేశారు. “నేను లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత నిజాయితీ గల వ్యక్తిని” అని సిసోడియా తెలిపారు.
తనపై, తన సహచర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిసోడియా అన్నారు. “ఢిల్లీ విద్య మరియు ఆరోగ్యం అద్భుతంగా పని చేస్తున్నాయని అందుకే నన్ను, ఆరోగ్య శాఖ మంత్రిని ఇబ్బందులు పెట్టి ప్రజలకు మంచి జరగకుండా అపుతున్నరాయన.