రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!

రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం (పీఎం కిసాన్‌) క‌టాఫ్ డేట్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా సాగు భూమి ఉన్న రైతుల‌కు పెట్టుబ‌డి…

రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం (పీఎం కిసాన్‌) క‌టాఫ్ డేట్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా సాగు భూమి ఉన్న రైతుల‌కు పెట్టుబ‌డి కింద ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఇచ్చే ప‌థ‌కానికి కేంద్ర స‌ర్కార్ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు ఏడాదిలో మూడు ద‌ఫాల్లో ఆరు వేల సొమ్మును వారి ఖాతాల్లో కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ చేస్తోంది.

2018 డిసెంబరు నుంచి 2019 ఫిబ్రవరి 1 మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారే పీఎంకిసాన్‌కు అర్హులని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి అమ్మ‌డం, కొన‌డం లేదా మార్పుచేర్పులైన రైతులకు పీఎం కిసాన్ నిధులు అంద‌డం లేదు. కటాఫ్‌ తేదీ తీసుకురావ‌డంతో అర్హులైన సన్న, చిన్నకారు రైతులకు పీఎం కిసాన్ నిధులు అంద‌క న‌ష్ట‌పోతున్నారు.

కటాఫ్‌ డేట్‌ తర్వాత భూ బదిలీ చేయించుకున్న సన్న, చిన్నకారు రైతులు చేసుకున్న దరఖాస్తులను అధికారులు వెన‌క్కి పంపుతున్నారు. దీంతో రైతులు ల‌బోదిబోమంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుతో ల‌క్ష‌లాది మంది ఆంధ్రా రైతాంగం న‌ష్ట‌పోనుంది.

మ‌రోవైపు రైతాంగానికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున భ‌రోసా ఇస్తాన‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల హామీ ఇచ్చారు. దానికీ అతీగ‌తీ లేదు. రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ స‌ర్కారే వుంది. రైతులంటే ఎంతో మ‌మ‌కారం వుంద‌ని మాట‌ల్లో చెప్ప‌డం మాని, చేత‌ల్లో చూపాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పై వుంది.

7 Replies to “రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం షాక్‌!”

  1. జనన మరణాల లెక్కలు సరిగ్గా నమోదుకావు….నిజంగా నిరుద్యోగులు ఎంతమంది అన్నది ఇప్పటికి లెక్కకి రాలేదు…ఇలాంటి సింపుల్ విసయాలనే సజావుగా అమలు చేయలేని యంత్రoగం పంటభూములు,వాటిని సాగుచేసేవాళ్ళ లెక్కలు సంపాదించకలదా…..అంత ఎవడో మధ్యలో దూరి చెప్పే కాకులు లెక్కలు రాసుకునేవాళ్ళ సలహా తప్పా..

Comments are closed.