Advertisement

Advertisement


Home > Politics - National

మహిళల లోదుస్తులు.. అబ్బాయిలే బ్రాండ్ అంబాసిడర్లు

మహిళల లోదుస్తులు.. అబ్బాయిలే బ్రాండ్ అంబాసిడర్లు

ఇది జంబలకిడిపంబ కాదు, జంబలకిడి జారు మిఠాయి అంతకంటే కాదు.. చైనాలో సరికొత్త ట్రెండ్. ఆడవారి లో-దుస్తులకు పురుషులు అక్కడ బ్రాండ్ అంబాసిడర్లు. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీనికి ఓ బలమైన కారణం ఉంది, అదేంటో తెలుసా..?

ఆన్ లైన్లో అమ్మాయిల లోదుస్తుల ప్రకటనలతో అశ్లీలత పెచ్చుమీరుతోందంటూ చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకూడదనే కండిషన్ పెట్టింది. ఓ ప్రత్యేక చట్టం కూడా తెచ్చింది. అయితే ఆ బ్రాండ్ ఓనర్లు ప్రమోషన్ కార్యక్రమాలను అంత తేలిగ్గా వదిలిపెడతారా..? కొన్నిరోజుల పాటు బొమ్మలకి లోదుస్తులు వేసి ప్రమోషన్ చేశారు. అదంతగా సక్సెస్ కాలేదు. దీంతో అబ్బాయిలకు వాటిని తగిలించారు.

అయితే మీసం గెడ్డంతో అబ్బాయిలు రఫ్ లుక్ లో అమ్మాయిల డ్రస్ లు వేసుకుని కనిపిస్తే చూడబుద్దేయదు కదా. అందుకే వారికి మాస్క్ లు తగిలించారు. అమ్మాయిల్లాగా సన్నగా రివటల్లా ఉండే మగ మోడల్స్ ని ఎంపిక చేసుకుని వారికి అమ్మాయిల లోదుస్తులు వేసి ఆన్ లైన్లో ప్రమోషన్ మొదలు పెట్టారు. ఇది సూపర్ సక్సెస్ అయింది.

అన్ని చైనా కంపెనీలు ఇప్పుడు తమ ఫిమేల్ ఇన్నర్ వేర్ ప్రమోషన్ కోసం మేల్ మోడల్స్ ని ఎంపిక చేసుకుంటున్నాయి. మాస్క్ లతో మొహం కనపడకుండా మగ మహారాజులు ఆడవారి దుస్తులకు హొయలు పోతూ బ్రాండింగ్ చేస్తున్నారు.

కుడి ఎడమైతే..

కర్రకి చీరకట్టినా చొంగ కార్చుకుంటూ చూస్తారంటారే.. సరిగ్గా ఇక్కడ కూడా అదే ప్లాన్ అప్లయ్ చేశాయి కంపెనీలు. మగవారితో ఆడవారి లోదుస్తులు వేయించి వీడియోలు, ఫొటోలు బయటకు వదులుతుండేసరికి వాటికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అమ్మాయిలతో పాటు, అబ్బాయిలు కూడా ఆ వీడియోలు చూసేందుకు ఉత్సాహపడుతున్నారట. 

మొత్తానికి చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇలా రివర్స్ తిరిగింది. ఇకపై అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా లోదుస్తుల యాడ్స్ లో నటించడానికి వీల్లేదు అని చైనా ప్రభుత్వం చట్టం చేయాలేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?