వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదు కాదని, అది జ్యోతిర్లింగమన్నారు. జ్ఞానవాపిని మసీదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ముస్లిం సమాజం ముందుకు వచ్చి “చారిత్రక తప్పిదానికి” పరిష్కారం చూపాలన్నారు.
“మసీదులో త్రిశూలం ఎందుకుంది..? మేమేమీ పెట్టలేదే. అక్కడ కచ్చితంగా జ్యోతిర్లింగం ఉంది. దేవుడి ప్రతిమలున్నాయి. అక్కడి గోడలు మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఓ చారిత్రక తప్పిదమే. దీనికి పరిష్కారం చూపించేందుకు ముస్లిం పిటిషనర్‌లు ముందుకు రావాలి. మాకు కావాల్సింది ఇదే”. అంటూ సూచనలు చేశారు.
కాగా మసీదు సముదాయంలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.