ఎంపీ అర్వింద్‌కు నిరసన సెగలు!

ఈసారి ఎలాగైనా తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీకి ఈ మ‌ధ్య కాలంలో పార్టీలోని అసంతృప్తుల‌తో ఇబ్బంది ప‌డుతోంది. గ‌త వారం నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంత మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు…

ఈసారి ఎలాగైనా తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీకి ఈ మ‌ధ్య కాలంలో పార్టీలోని అసంతృప్తుల‌తో ఇబ్బంది ప‌డుతోంది. గ‌త వారం నిజామాబాద్ జిల్లాకు చెందిన కొంత మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలోనే ఆందోళ‌నకు దిగారు. ఈ రోజు అదే నాయ‌కులు నిజామాబాద్ పార్టీ అఫీసు వ‌ద్ద ఆందోళ‌న‌లు చేస్తూ.. ఎంపీ అర‌వింద్ వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

కాగా ఎంపీ అర్వింద్ ఏక‌ప‌క్షంగా 13 మండ‌లాల అధ్య‌క్షుల‌ను మార్చార‌ని.. సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే అర్వింద్ అన్యాయం చేస్తున్నారని మండిప‌డుతూ.. ఎంపీ డాం.. డాం.. న‌రేంద్ర మోడీ జిందాబాద్ అంటూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. కార్య‌క‌ర్త‌లు మాట్లాడుతూ గ‌త వారం కిష‌న్ రెడ్డి త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వాపోయారు. 

ఇప్ప‌టికే నిజామాబాద్ కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌పై ఎంపీ స్పందిస్తూ.. మండ‌ల అధ్య‌క్షుల మార్పులో త‌న ప్ర‌మేయం లేద‌ని.. జిల్లా అధ్య‌క్షుడి నిర్ణ‌యం మేర‌కే మండ‌ల అధ్య‌క్షుల నియామ‌కాలు ఉంటాయ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.