Advertisement

Advertisement


Home > Politics - National

స్కూల్ బ్యాగ్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు

స్కూల్ బ్యాగ్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు

స్కూల్ కు వెళ్లే పిల్లల బ్యాగుల్లో ఏముంటాయి? పుస్తకాలు, పెన్నులు, లంచ్ బాక్సు.. మహా అయితే చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి. కాలం మారింది కాబట్టి సెల్ ఫోన్లు కూడా ఉంటున్నాయి. కానీ బెంగళూరులో ఆకస్మికంగా జరిపిన తనిఖీల్లో విస్తుగొలిపే వస్తువులు బయటపడ్డాయి.

స్కూల్ పిల్లల బ్యాగుల్లో కండోమ్స్ దొరికాయి. మరికొంతమంది ఆడపిల్లల బ్యాగుల్లో గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ఎక్కువమంది విద్యార్థులు బ్యాగుల్లో (ఆడ-మగ తేడా లేకుండా) సిగరెట్లు, లైటర్లు దొరికాయి. కొంతమంది పిల్లలైతే వాటర్ బాటిల్ లో మద్యం పోసుకొని స్కూల్స్ కు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకొంతమంది బ్యాగుల్లో వైటనర్స్ కూడా గుర్తించారు.

బెంగళూరులోని ప్రైమరీ-సెకండరీ స్కూల్స్ కు చెందిన అసోసియేటెడ్ మేనేజ్ మెంట్ చేసిన సూచనల ఆధారంగా కొన్ని స్కూల్స్ లో ఆసక్మిక తనిఖీలు నిర్వహించగా, ఇవన్నీ బయటపడ్డాయి. ఈ బ్యాగులన్నీ 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులవి.

పిల్లలు తమ స్కూల్స్ కు రహస్యంగా సెల్ ఫోన్స్ తీసుకొస్తున్నారని, వాటిని అరికట్టాలనే లక్ష్యంతో తనిఖీలు నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే సెల్ ఫోన్లు తక్కువ, పైన చెప్పుకున్న వస్తువులు ఎక్కువగా కనిపించేసరికి అంతా అవాక్కయ్యారు. ఈ లిస్ట్ లో బెంగళూరులోని ప్రముఖ పాఠశాలన్నీ ఉన్నాయి.

విషయం తెలుసుకున్న వెంటనే సదరు స్కూల్స్ యాజమాన్యాలు స్టూడెంట్-పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటుచేశాయి. తనిఖీల్లో బయటపడిన వస్తువులు చూసి తల్లిదండ్రులు కూడా ఖంగుతిన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?