ఒడిషా రైలు ప్రమాదం.. 233కు చేరిన మృతుల సంఖ్య!

ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరుకుంది. ఇప్పటివరకు 233 మంది ప్రమాణికులు మృతి చెందినట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా తెలిపారు. మరో వైపు ప్రమాదంలో…

ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరుకుంది. ఇప్పటివరకు 233 మంది ప్రమాణికులు మృతి చెందినట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా తెలిపారు. మరో వైపు ప్రమాదంలో 900 మందికి పైగా గాయపడినట్టు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.  మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది.  మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కాగా నిన్న రాత్రి షాలిమర్-చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పి, పక్కనే ఉన్న ట్రాక్ పై పడ్డాయి. అదే టైమ్ లో అటుగా వస్తున్న యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు… ఈ బోగీల్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత రెట్టింపు అయింది. అదే టైమ్ లో యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ లో కూడా 4 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో మృతుల‌ సంఖ్య భారీగా పెరిగిన‌ట్లు అంచ‌న వేస్తున్నారు.

ప్ర‌మాదం జరిగిన వెంటనే ఒరిస్సా సర్కార్ స్పందించింది. దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న 80కి పైగా అంబులెన్సుల్ని ఘటనా స్థలానికి పంపించింది.  అన్నీ ఆస్పత్రుల్లో కలిపి దాదాపు 900  మందికి పైగా చికిత్స అందిస్తుండగా…. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.