ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.. మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మనీస్ సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవని అని.. ఆయన బయటకు వెళ్లితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని తెల్చి చెప్పింది.
తాజా ఢిల్లీ హైకోర్టు తీర్పుతో మనీష్ సిసోడియా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఆరు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.
కాగా సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 29న సీబీఐ అధికారులు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత వారంలో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని జూన్ 1 వరకు పొడిగించింది. ఆ టైంలో విచారణ నిమిత్తం రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు మెడపట్టుకొని బలవంతంగా లాక్కెళ్లిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది.