ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ ఇవాళ జమ్మూలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన కొత్త పార్టీకి 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని పేరు పెట్టారు. తన పార్టీకి కోసం మంచి పేరును సూచించాలని ప్రజలకు పిలుపునివ్వగా దాదాపు 1500 పేర్లను సూచించారని అందులో నుండి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ ఎంపిక చేశామని తెలిపారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసిన గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీరుకు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా, రాజ్యసభ ఎంపీగా పని చేశారు. గత ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు కూరిపించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి కొవర్టుగా పని చేశారని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా గులాం నబీ ఆజాద్ పై విమర్శలు కురుపించింది. ఇవాళ పార్టీ ప్రకటనతో జమ్ములో కాంగ్రెస్ పార్టీకి ఇంకో రాజకీయ శత్రువు తోడయినట్లు కనపడుతోంది.