Advertisement

Advertisement


Home > Politics - National

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో మరో ట్విస్ట్‌!

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో మరో ట్విస్ట్‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్‌ చేటుచేసుకుంది. ఈడీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నితీష్ రాణా రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 2015 నుండి ఈడీకి స్పెష‌ల్ ప్రాసిక్యూట‌ర్ గా ఉన్న రాణా అనేక కీల‌క కేసుల్లో ఈడీ త‌రుపున‌ ప్రాతినిధ్యం వ‌హించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా.. శనివారమే ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ అధికారులు విచారించారు. ఇలాంటి పరిస్థితుల్లో నితేశ్ రాణా రాజీనామా వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని, కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, కాంగ్రెస్ నేత డికె శివకుమార్, ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్,  టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, విజయ్‌ మాల్యా, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో ఈడీ తరపున ఆయన వాదనలు వినిపించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?