జీఎస్టీ చెల్లిస్తే ఇక అంతే సంగతులు

‘ఒకసారి అమ్మిన సరుకులు వెనక్కు తీసుకోబడవు’ ఇలాంటి బోర్డులు దశాబ్దాల కిందట దుకాణాల్లో కనిపించేవి. కాల క్రమేణా అవి మాయం అయ్యాయి. అది వేరే సంగతి. ఇప్పుడు అది ఎందుకు చెప్పుకోవడం అంటే కేంద్రం…

‘ఒకసారి అమ్మిన సరుకులు వెనక్కు తీసుకోబడవు’ ఇలాంటి బోర్డులు దశాబ్దాల కిందట దుకాణాల్లో కనిపించేవి. కాల క్రమేణా అవి మాయం అయ్యాయి. అది వేరే సంగతి. ఇప్పుడు అది ఎందుకు చెప్పుకోవడం అంటే కేంద్రం ఆలోచనావిధానాలు అలాగే వున్నాయి కనుక. ఒకసారి పన్ను చెల్లిస్తే అది వెనక్కు ఇచ్చే ప్రసక్తే లేదు అంటోంది.

విషయం ఏమిటంటే హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే టారిఫ్ ప్రకారం చెల్లిస్తాం. దానితో పాటే జీఎస్టీ కూడా చెల్లిస్తాం. ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే హోటల్ పాలసీ ప్రకారం మన డబ్బులు మనకు వెనక్కు వస్తాయి. 

ఏ అప్లికేషన్ ద్వారా హోటల్ రూమ్ బుక్ చేసుకున్నామో వాళ్లు వందో రెండు వందలో కట్ చేసుకుని అమౌంట్ వెనక్కు ఇస్తారు. ఇక్కడ వుంది అసలు విషయం. బుక్ చేసినపుడు జీఎస్టీ కడతాం కదా, అది కూడా వెనక్కు ఇస్తారు. కానీ ఇకపై అలా కుదరదు అంటోంది కేంద్రం. ఒకసారి జీఎస్టీ పే చేసావు కనుక, క్యాన్సిల్ అయినా సరే ఇవ్వము అంటోంది. అంటే ఇకపై బుకింగ్ యాప్ చార్జెస్ తో పాటు జీఎస్టీ కూడా వదులకోవడానికి సిద్దమై క్యాన్సిల్ చేసుకోవాలన్న మాట.

ఇదే స్కీమును కేంద్రం రైల్వే టికెట్ లకు కూడా వర్తింప చేస్తోంది ఇప్పుడు. రైలు టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా, దానిపై ముందుగా కట్టిన జీఎస్టీ వెనక్కు ఇవ్వరంట. ఎంత కమర్షియల్ గా ఆలోచిస్తోందో కేంద్ర ప్రభుత్వం. ఏకీకృత పన్ను విధానం, అంతా బాగుంటుంది. అందరికీ బాగుంటుంది అని నమ్మబలికి జిఎస్టీని చాలా దూర దృష్టితో తీసుకువచ్చారు. ఒక్కోదాని మీద జిఎస్టీని పెంచుకుంటూ పోతున్నారు. ఆఖరికి దేవాలయాలను కూడా వదలడం లేదు.

ప్రయివేటు వ్యాపారులే నయం అనిపిస్తుందేమో ఇక కొన్నాళ్లకు కేంద్ర జిఎస్టీ శాఖ.