షిండే, అజిత్ ల‌ను బీజేపీ ఎన్నాళ్ల‌లో వ‌దిలించుకుంటుంది?

మహారాష్ట్ర రాజ‌కీయాల్లో షిండే, అజిత్ పేర్లు ఇక వీలైనంత త‌క్కువ‌గా, వీలైనంత చిన్న‌గా వినిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది.

మ‌హారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 288. లెక్క ప్ర‌కారం క‌నీస మెజారిటీ 145. ప్ర‌స్తుతం బీజేపీకి సొంతంగా ఉన్న ఎమ్మెల్యేల బ‌లం 132. శివ‌సేన‌(షిండే) పార్టీ త‌ర‌ఫున నెగ్గిన వారి సంఖ్య 57. ఎన్సీపీ (అజిత్) పార్టీ త‌ర‌ఫున నెగ్గిన వారి సంఖ్య 41. ప్ర‌స్తుతం బీజేపీ ఫార్ములా ప్ర‌కారం.. సీఎం సీటు బీజేపీ నేత‌కు, షిండే, అజిత్ ల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు అనే మాట వినిపిస్తూ ఉంది.

మొన్న‌టి వ‌ర‌కూ షిండేకు డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ను లాంఛ‌నంగా సీఎం గా చేయొచ్చు. గ‌తంలో త‌ను సీఎంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ ఫ‌డ్న‌వీస్ అస‌రార్థం ఆ త‌ర్వాత షిండేకు డిప్యూటీగా చేశాడు కాబ‌ట్టి, ఇప్పుడు షిండే ఆయ‌న‌కు డిప్యూటీగా చేయ‌డంలో పెద్ద ఘోరం ఏమీ లేద‌నేది బీజేపీ త‌ర‌ఫున వినిపిస్తున్న థియ‌రీ. ఇక డిప్యూటీ సీఎం పాత్ర‌కే రాజ‌కీయాల్లో ఉన్న‌ట్టుగా అజిత్ ప‌వార్ ఉన్నాడు. కాబ‌ట్టి.. ఆయ‌న కు డిప్యూటీ సీఎం ప‌ద‌వే ప‌ర‌మాన్నం! అయితే ఎటొచ్చీ షిండేనే గొణుగుతున్న‌ట్టుగా ఉన్నాడు.

మోడీ, షాలు ఏది చెబితే అని నిష్టూరం ఆడుతున్నాడు, శివ‌సేన‌ను చీల్చుకొచ్చిన‌ప్పుడు త‌న‌ను సీఎంగా చేశారు కాబ‌ట్టి, ఇప్పుడు కూడా త‌న‌నే సీఎంగా చేయాల‌నే డిమాండ్ ఆయ‌న వైపు నుంచి వినిపించింది. మ‌రి ఇలాంటి డిమాండ్ చేసినందుకే క‌దా.. ఉద్ధ‌వ్ ఠాక్రేను బీజేపీ వాళ్లు శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించార‌నేది షిండేకు తెలియ‌ని అంశం అయితే కాదు!

రాజీ ప‌డ‌టం మిన‌హా షిండేకు మ‌రో మార్గం కూడా లేదు. ఆయ‌న ఆ మాత్రం లౌక్యం తెలియ‌నివాడూ కాదు. అయితే సీఎం హోదాలో ఉన్న‌ప్పుడే షిండే ప‌లు సార్లు అలిగాడు. త‌నను సీఎంగా కూర్చోబెట్టి మొత్తం బీజేపీ వాళ్లు ఆడుకుంటున్నార‌నే ఆక్రోశం ఆయ‌న‌లో గ‌తంలోనూ ధ్వ‌నించింది. ఒక ద‌శ‌లో ఆయ‌న అలిగి వెళ్లిపోయార‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. సీఎంగా త‌ను ఉండ‌గా.. కేబినెట్ గురించి అయినా, మ‌రో విష‌యంలో అయినా డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లి చ‌ర్చించి రావ‌డం గురించి షిండే నొచ్చుకున్నారు! అయితే అప్పుడు అలా నొచ్చుకున్నా పెద్ద మార్పేం క‌నిపించ‌లేదు. గ‌త్యంత‌రం లేక బీజేపీతోనే షిండే ఎన్నిక‌ల‌కు వెళ్లారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న కొత్త‌గా చేయ‌గలిగింది ఏమీ లేద‌నే చెప్పాలి.

సీఎం హోదాలో కూర్చోబెట్టిన‌ప్పుడే త‌న‌ను డ‌మ్మీగా చేసిన బీజేపీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే త‌న‌తో ఆటాడుకోవ‌డం పెద్ద విష‌యం కాద‌ని ఆయ‌న గ్ర‌హించే ఉండాలి. కొంద‌రు తెలివైన వాళ్లు ఇచ్చే స‌ల‌హా ఏమిటంటే.. షిండే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని. కావాలంటే కేంద్ర మంత్రి ప‌ద‌వి, లేదా ఈ కూట‌మి క‌న్వీన‌ర్ వంటి ప‌ద‌వి తీసుకుని డిప్యూటీ సీఎం హోదా జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని షిండే హితోభిలాషులు సోష‌ల్ మీడియాలో స‌ల‌హాలు ఇస్తున్నారు.

అయితే ఏ హోదాలో ఉన్నా, షిండే కు అప్రాధాన్య‌త అంటే ఏమిటో ఇప్పుడు బీజేపీ రుచి చూపిస్తుంది. ఆల్రెడీ సీఎంహోదాలోనే ఆయ‌న చూసి ఉన్నారు. అయితే అప్పుడు తాము సీఎం సీటు ఇచ్చినందుకు బీజేపీ ఎంత బాధ‌ప‌డిందీ ఇప్పుడు ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేలా చేస్తార‌న‌డంలో ఎలాంటి వింత లేదు! అప్పుడు బీజేపీ త‌న అవ‌స‌రార్థ‌మే షిండేకు సీఎం సీటు ఇచ్చింది. అయినా ఇప్పుడు ప్ర‌తీకారం అయితే గ‌ట్టిగానే ఉండొచ్చు. బీజేపీ కోరిక మేర‌కే షిండే శివ‌సేన‌ను చీల్చుకొచ్చారు. బీజేపీతోనే క‌లిసి సాగుతున్నారు. అయినా షిండేకు చుక్క‌లు క‌నిపించ‌డం అయితే ఖాయం.

ఇప్పుడు త‌న వ‌ద్ద 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని షిండే అనుకోవ‌డానికి ఏమీ లేదు! వారిలోంచి ఇంకో షిండేను పుట్టించాల్సిన అవ‌స‌రం కూడా ఇప్పుడు బీజేపీ లేదు! ఒకే మాట‌తో.. శివ‌సేన‌ను తాము విలీనం చేసేసుకుంటున్నామ‌ని బీజేపీ ప్ర‌క‌టించినా అరిచి గగ్గోలు పెట్టే నాథుడు లేడు! ఇక శివ‌సేన ఎమ్మెల్యేల్లో కూడా షిండేను లెక్క చేసేది ఎంత‌మంది? ఉద్ధ‌వ్ ఠాక్రేనే లెక్క చేయ‌ని వాళ్లు ఇప్పుడు షిండేను లెక్క చేస్తార‌ని ఎవ్వ‌రూ అనుకోరు. బీజేపీ అనుకుంటే.. ఈ విలీనం రోజుల వ్య‌వ‌ధిలో పూర్త‌వుతుంది. షిండే ఒక్క‌డూ అప్పుడు గ‌గ్గోలు పెట్టినా ప‌ట్టించుకునే వారు ఉండ‌రు. అప్పుడు ఉద్ధ‌వ్ కు నువ్వు నామాలు పెడితే, ఇప్పుడు నీకు బీజేపీ నామాలు పెట్టింద‌నే మాటే స‌ర్వ‌త్రా వినిపిస్తుంది.

ఇక అజిత్ ప‌వార్ సంగ‌తి స‌రే స‌రి. ఆయ‌నకు ఇప్పుడు ఇగో ఇష్యూస్ ఏమీ లేవు. కేసులు, ఇబ్బందులు లేక‌పోతే చాలు. మంత్రి ప‌ద‌వి, డిప్యూటీ సీఎం.. హోదాల గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉండ‌దు. అయినా అజిత్ కు డిప్యూటీ సీఎం అంటున్నార‌ట! అదే ఆయ‌న‌కు ప‌దివేలు! గ‌తంలో తాము తీవ్ర అవినీతి ప‌రుడుగా చెప్పిన అజిత్ కు బీజేపీ ఎప్పుడో మంచివాడ‌నే తీర్థం పోసింది కాబ‌ట్టి.. బీజేపీ ప్రాపంకంలో అజిత్ బ్యాలెన్స్ రాజ‌కీయ జీవితం కొన‌సాగ‌వ‌చ్చు! అది ఆయ‌న అదృష్టం. కానీ, అజిత్ ను బీజేపీ వ‌దిలించుకోవాల‌నే డిమాండ్ క‌మ‌లం పార్టీలోని ఒక వ‌ర్గం నుంచి వినిపిస్తూ ఉంది. అవ‌స‌రానికి తీసుకున్నారు స‌రే, ఇప్పుడు అత‌డి అవ‌స‌రం లేద‌ని, ఇక శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించాల‌ని ఈ వ‌ర్గం వాదిస్తూ ఉంది. కాబ‌ట్టి.. అజిత్ వీలైనంతా సాగిలా ప‌డ‌ట‌మే మిగ‌ల‌వ‌చ్చు!

ఏతావాతా.. మహారాష్ట్ర రాజ‌కీయాల్లో షిండే, అజిత్ పేర్లు ఇక వీలైనంత త‌క్కువ‌గా, వీలైనంత చిన్న‌గా వినిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరిని రాజ‌కీయ చిత్రం నుంచి వీరి ప్రాధాన్య‌త‌ను బీజేపీ చాలా త‌గ్గించివేస్తుంది. అస‌లు వీరొక‌రు ఉన్నార‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు, ప‌రిశీల‌కులు కూడా ప‌ట్టించుకోని ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశాలు అయితే పుష్క‌లంగా కనిపిస్తూ ఉంది.

29 Replies to “షిండే, అజిత్ ల‌ను బీజేపీ ఎన్నాళ్ల‌లో వ‌దిలించుకుంటుంది?”

  1. గుడ్ ఆర్టికల్ . బీజేపీ అంతే . ఆక్రమించుకోవడం దానికి అలవాటు పెద్ద మరీ చెట్టు దెబ్బ కి చిన్న చెట్లు అతక్క కుతలం. అయినా షిండే క్కు మంచి పోర్ట్ఫోలియో అయితే ఇస్తారు .ఇంకా కాదు అంటే ఉద్ధవ్ ఠాక్రే వచ్చి బీజేపీ లో కలిసిన వింత లేదు .

    1. బీజేపీ తో జత కట్టడం వల్ల ఆ మాత్రం వచ్చాయి లేకపోతే ఉమ్మడి శివసేన బలం గత 2 ఎన్నికల్లో చూసాం కదా

  2. మన రాతగాళ్ళల్లో గొప్పతనం ఏమిటంటే, తాము ఎదవల మోచేతినీళ్లు తాగుతూ, వాళ్లకు అనుకూలంగా రాస్తూ, ఇతరుల విషయంలో నైతికవిలువల రంధ్రాన్వేషణ చేస్తారు. తమకు లేని ఇతరులకు కావాలి.

  3. 2014 లో ఒరిజినల్ శివసేన బయటకు పోయి చావుదెబ్బ తిని, చెంపలు వేసుకుని మళ్ళీ బీజేపీ పక్కన చేరింది., 2019 లో ఇద్దరూ సమానమైన సీట్లు పోటీ చేస్తే, బీజేపీ 104 సీట్లు గెలిస్తే, శివసేన 57 దగ్గర ఛతికిలా పడింది. బీజేపీ సిట్లలో సగం కూడా గెలవకపోయినా సీఎం పదవికి పేచీ పెట్టి ఆగర్భశత్రువులైన NCP కాంగ్రెస్ తో జట్టు కట్టి, బీజేపీ ని మోసం చేసింది. ఈ వివరాలు చెప్పి అప్పుడు అడిగితే, బీజేపీ శివసేనను మోసం చేసిందో లేక బీజేపీ శివసేనను దెబ్బకు దెబ్బతీసిందో జనం క్లారిఫయ్ చేస్తారు. అర్దసత్యాలు చెప్పి విషం కక్కవద్దు.

    1. బయటకు వచ్చిన షిండేకు సీఎం ఇవ్వటమే బీజేపీ చేసిన పెద్ద తప్పు.

      షిండే శివసేన కూ, అజిత్ పవార్ కూ ఇచ్చిన సీట్లలో పోటీ పెట్టటానికి అభ్యర్థులు లేకపోతే బీజేపీ తన మనుషులను అప్పు ఇచ్చింది. షిండే తరపున అజిత్ తరపున గెలిచినవాళ్ళల్లో 17 మంది బీజేపీ మనుషులు. ఈ సంగతి కూడా చెప్పాలిగా.

      తనకి ఇచ్చిన సీట్లలో నిలబెట్టే తికానా లేని షిండే ను బీజేపీ ఎంతకాలం మోయాలి. ఇలా మోస్తూ పొతే రేపు బీజేపీ కి ఏమి గతి పట్టుతుంది. బీజేపీ కు 132 వస్తే షిండే కు వచ్చింది 55+. అంటే సగం కూడా లేదు. అయినా ఎల్లకాలం షిండే ను మోయాలి లేకపోతే నమ్మకద్రోహం. అంతేగా

    2. బీజేపీ కి వచ్చింది 132. షిండే కు వచ్చింది 55+. అయినా బీజేపీ షిండే ను మోయాలి, లేకపోతే నమ్మకద్రోహం. ఈ ఎదవల వ్యాసాలు పట్టించుకుని బీజేపీ త్యాగాలు చేస్తూ పొతే బీజేపీ కి మిగిలేది చిప్పకూడు మాత్రమే

      1. షిండే కు అజిత్ కూ ఇచ్చిన సీట్లలో నిలబెట్టటానికి అభ్యర్థులు లేకపోతే బీజేపీ తన మనుషులను అప్పు ఇచ్చింది. అలా వాళ్ళ తరఫున గెలిచిన వాళ్ళల్లో 17 మంది బీజేపీ వాళ్ళు. తమకు ఇచ్చిన సీట్లలో పోటీ చేసేందుకే మనుషులు లేని షిండే ను బీజేపీ ఎల్లకాలము మోయాలి కదా. ఎందుకు మోయాలి అనేదే ప్రశ్న

      2. షిండే కు అజిత్ కూ ఇచ్చిన సీట్లలో నిలబెట్టటానికి అభ్యర్థులు లేకపోతే బీజేపీ తన మనుషులను అప్పు ఇచ్చింది. అలా వాళ్ళ తరఫున గెలిచిన వాళ్ళల్లో 17 మంది బీజేపీ వాళ్ళు. మరి ఆ సంగతి కూడా చెప్పు

        1. . తమకు ఇచ్చిన సీట్లలో పోటీ చేసేందుకే మనుషులు లేని షిండే ను బీజేపీ ఎల్లకాలము మోయాలి కదా. ఎందుకు మోయాలి అనేదే ప్రశ్న

        2. ఇచ్చిన కాసిని సీట్లు కూ అభ్యర్థులను వెతుక్కునే షిండే ను లేపి కూర్చోబెట్టి సవరదీయటం బీజేపీ బాధ్యతా?

          1. మన దేశంలో జనం తీసేది పరమ ఎదవలకు. ఆ ఎదవలకు ఓటేసేవాళ్ళు కూడా బీజేపీ కి ధర్మపన్నాలు చెప్పటమే మన దరిద్రం.

      3. ఎదవలకు కూడా మద్దత్తు ఇచ్చేవారు కూడా నైతికవిలువల గురించి మాట్లాడితే రోతగా ఉంటుంది

  4. ఎంతసేపు బీజేపీ మీద ఏడవటం తప్పితే వేరే కోణం చూడరు, ఉద్దవ్ తో విసిగిపోయిన కాంగ్రెస్ షిండే తో టచ్ లో ఉండి ఎన్నికల అనంతరం షిండే సేన కలుపుకునే ఆలోచన లో ఉన్న వార్తలు ఎందుకు రాయరు? జ్యోతి లో బుధవారం ఎడి్టోరియాల్ కథనం లో రాసారు.

        1. అవునా. 57 వచ్చిన శివసేన కు 77 అని చెప్పేంత తెలివితేటలూ లేవు కాబట్టి, నేను కూడా అంతే మరి

  5. షిండే కూ అజిత్ కూ కేటాయించిన స్థానాలలో నిలబెట్టటానికి మనుషులు లేకపోతే బీజేపీ సప్లై చేసింది. మరి ఆ సంగతి చెప్పవే? నోరు పడిపోయిందా?

    తనకి ఇచ్చిన సీట్లకే గట్టిలేనివాడిని జీవితాంతం బీజేపీ మోయాలా?

    1. రెండు పార్టీ లు కలిపా 🤣 ఒకటే శివసేన, ఒకటే NCP పోటీ చేసింటే వాళ్లకు ఆ సీట్లు కూడా రావు గత ఎన్నికల్లో చూసాం కదా అందరూ సొంతంగా పోటీ చేస్తే ఎన్ని వచ్చాయో

  6. బీజేపీ వల్ల షిండే లాభ పడ్డాడు, ఉద్దవ్ తో ఉంటే గత రెండేళ్లు ఉన్నట్లు గా ఎప్పటికీ సీఎం అయ్యేవాడు కాదు. ఇప్పుడు సీఎం కాకపోయినా 50 ప్లస్ ఎమ్మెల్యే లకి ఎంపీ లకి అధికార కేంద్రం గా మారుతున్నాడు ఒక శరద్ పవార్ లాగా!

    1. అవన్నీ వీడికి అర్ధం అవుతాయా? వీళ్లకు కొన్ని లెక్కలు ఉంటాయి. వీళ్ళ ఆలోచనల ప్రకారం బీజేపీ నడవాలి. ఒక జైలుపక్షి నాయకత్వంలోని పార్టీ కి మద్దత్తు ఇచ్చే వెబ్సైటు లో వ్యాసాలు రాసుకునే వాడూ సూక్తులు డోక్కుంటే, ఖండన మండనాలు చేయటం మన దరిద్రం

  7. ప్రస్తుతం బీజేపీ ఫార్ములా అని ఆ వెటకారాలు ఏమిటి? ఇంతకుముందు ఒకసారి NCP కంటే కాంగ్రెస్ కి రెండు మూడు సీట్లు తక్కువ వచ్చినా జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి తీసుకుంది, అందువల్ల ఏ రకంగా చూసుకున్నా బీజేపీ కే సీఎం పదవి దక్కాలి.

  8. ఈ ఎన్నికల ముందు పరిస్థితి వేరు, న్యాయం గా బీజేపీ కే సీఎం పదవి దక్కాల్సి ఉన్నా శివసేన ద్రోహం వల్ల షిండే కి సీఎం పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగి రాజకీయ వాతావరణం మారింది. అందుకని ఇంతకుముందు చేసిన నిర్ణయాలు మార్చాలి.

Comments are closed.