తెలంగాణలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు వివిధ మార్గాల ద్వారా ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, మరికొన్ని ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోట ఎమ్మెల్సీ అవకాశాలు కూడా ఉన్నాయి! ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో అయితే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ప్రజల తీర్పు కోసం వెళ్లవలసి వస్తే ఫలితం ఎలా ఉంటుందో ముందే తేల్చి చెప్పడం కష్టం.
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆశావహులు అందరూ కూడా తమకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ మాత్రమే కావాలని, ఎన్నికలకు తమ సిద్ధంగా లేమని పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్న విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా మళ్లీ పోటీ చేయడానికి విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి లోబడి ఉంటానని కూడా ఆయన అంటున్నారు.
జీవన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఆశావహులందరూ కూడా ఎమ్మెల్యే కోటా ద్వారా మాత్రమే పెద్దల సభలో అడుగు పెట్టాలని ఆశపడుతుండడం విచిత్రమైన పరిణామం.
ఇలా ఎందుకు జరుగుతోంది? అనే అంశంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి- పార్టీ కోసం ఇన్నాళ్లు చాలా కష్టపడ్డాం. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త నింపాదిగా పదవులు అనుభవించే పరిస్థితి ఉంటే బాగుంటుంది.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టుకునే స్థితిలో లేం అనే అభిప్రాయంతో కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అలాగే మరికొందరు నాయకులు రేవంత్ రెడ్డి పరిపాలన తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారేమో అనే అభిప్రాయం కూడా విశ్లేషకుల్లో వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి పాలన బాగా లేదని అనుకుంటూ, తాము ఏ గ్రాడ్యుయేట్ ఎన్నికల పేరుతోనో తీర్పు కోసం ప్రజల వద్దకు వెళ్తే, రేవంత్ పాలన నెగెటివిటీ తమ మీద పడుతుందని.. ఓటమి తప్పదనే భయంతో ఉన్నారేమో అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని, అందువల్లనే ఎమ్మెల్యే కోటా ద్వారా అయితే పదవి గ్యారెంటీగా దక్కుతుందనే అభిప్రాయం వారిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ అందరూ ఎమ్మెల్యే కోటా కోసం మాత్రమే ఎగబడితే ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేసేదెవరు? అనే చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా నడుస్తుండడం గమనార్హం!
Call boy works 7997531004
Call boy jobs available 7997531004