ఫోన్ ట్యాపింగ్ నేరస్తులకు అమెరికాలో ఆశ్రయమా?

ఇక్కడ కీలక పదవులు అనుభవించడం.. ఆ అనుభవించే క్రమంలో పదవులు కట్టబెట్టిన పెద్దలకు అనుచిత మార్గాల్లో దోచిపెట్టడం, అడ్డదారుల్లో మేళ్లు చేకూర్చడం.. ప్రభుత్వాలు మారి తమ మీద కేసులు నమోదు అయితే.. విదేశాలకు పారిపోయి…

ఇక్కడ కీలక పదవులు అనుభవించడం.. ఆ అనుభవించే క్రమంలో పదవులు కట్టబెట్టిన పెద్దలకు అనుచిత మార్గాల్లో దోచిపెట్టడం, అడ్డదారుల్లో మేళ్లు చేకూర్చడం.. ప్రభుత్వాలు మారి తమ మీద కేసులు నమోదు అయితే.. విదేశాలకు పారిపోయి తలదాచుకోవడం అనేది చాలా మామూలు విషయంగా మారిపోయింది.

కేవలం తెలుగు రాష్ట్రాలు అని మాత్రమే కాదు. ఎక్కడైనా సరే.. ఒక ప్రభుత్వ కాలంలో అడ్డదారుల్లో రెచ్చిపోయిన వారు.. ప్రభుత్వాలు మారిన తర్వాత.. విదేశాలకు పారిపోవడాన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇలా కొన్నాళ్లు పారిపోయి మళ్లీ తిరిగి రావడం ఇదంతా బాగానే ఉంటుంది గానీ.. ఏకంగా విదేశాల్లో సెటిలైపోవాలని అనుకోవడం.. పైగా వీసా సమస్యలు కూడా తలెత్తకుండా ఏకంగా తమను రాజకీయ శరణార్థులుగా గుర్తించాలని ఈ నేరస్తులు విన్నవించుకోవడం ఇప్పుడు కొత్త పోకడ.

తెలంగాణలో భారాస ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ అనే దుర్మార్గమైన చర్య ద్వారా.. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాకుండా.. వ్యాపార, సినీ దిగ్గజాల రహస్యాలు, గుట్టుమట్టులన్నీ తెలుసుకుంటూ ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు కొందరు వారిని బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకోవడానికి కారణమైన ట్యాపింగ్ నిందితులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పూర్తిస్థాయిలో నాయకత్వం వహించిన అప్పటి పోలీసు ఉన్నతాధికారి ప్రభాకరరావు ఇప్పుడు తనకు రాజకీయ శరణార్థిగా అమెరికాలోనే శాశ్వత ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రభాకరరావు.. ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు. ఆ మొత్తం వ్యవహారానికి సారథి. భారాస పాలకులకు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసిన తొలిరోజునే ఆయన అమెరికా పారిపోయారు. అప్పటినుంచి విచారణ నిమిత్తం పిలుస్తున్న పోలీసులతో రకరకాలుగా ఆడుకుంటున్నారు.

స్థానికంగా దొరికిన అధికారులు, సాక్ష్యాలతో ఒక స్థాయి వరకు విచారణ చేసిన పోలీసులు ప్రభాకరరావు పాత్రను ధ్రువీకరించారు. అయితే ఆయన అమెరికాలో తిష్టవేసి అనారోగ్యం వల్ల వచ్చానని, నెలలో వస్తా రెండు నెలల్లో వస్తా అంటూ కొంతకాలం సాగదీశారు. ఇంకా సర్జరీలు జరుగుతున్నాయని, అంతా కుదుటపడిన తర్వాత గానీ రాలేనని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ట్విస్టు చోటుచేసుకుంది.

ఇక్కడ క్రిమినల్ నేరాలకు పాల్పడిన వ్యక్తి అమెరికాకు వెళ్లిపోయి అక్కడ తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరితే అది చెల్లుతుందా? అమెరికా ప్రభుత్వం అలాంటి నేరపూరిత ఎత్తుగడలను అనుమతిస్తుందా? అనేది చూడాలి.

7 Replies to “ఫోన్ ట్యాపింగ్ నేరస్తులకు అమెరికాలో ఆశ్రయమా?”

  1. ఆర్థిక ఉద్రవాదులకు మనము ఆశ్రమం ఇవ్వట్లేదా..అలాగే వాళ్లు కూడా..

  2. More than 48 hours have passed since the most honest man on the earth Jagan has given a serious warning to some Telugu media about falsely accusing his involvement in bribery and yet no action about filing defamation casex in the courts. Is he waiting for Tuesday to give some coverage to his beloved Sakshi?

Comments are closed.