తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ.. అందులోనే మళ్లీ కొన్ని మతలబులు పెట్టినట్టుగా కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వ అనుకూల వ్యక్తులు మాత్రమే మాట్లాడుకోడానికి వీలుగా, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ల నోళ్లకు తాళాలు వేసేలాగా ఈ కొత్త ఉత్తర్వులను డిజైన్ చేశారా అనే అనుమానం కలుగుతోంది.
శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. రాజకీయ నాయకులు దర్శనం తర్వాత ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు విమర్శలు చేస్తున్నారని అందువల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ బోర్డు ఇటీవల చేసిన తీర్మానం ప్రకారం ఉత్తర్వులు వచ్చాయి.
నిషేధం మంచిదే. కానీ నిషేధం పూర్తిగా ప్రతి రాజకీయ ప్రసంగం మీద ఉండాలి. అందులో మళ్లీ విద్వేషపూరిత అనే మాట చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. అంటే స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత.. ప్రభుత్వాన్ని అడ్డంగా పొగిడేవాళ్లకైతే అన్నీ అనుమతిస్తారా? అనే సందేహం కలుగుతోంది. తిరుమల దేవదేవుని ఎదుట నిల్చుని చంద్రబాబు భజన చేస్తే మాత్రం అనుమతిస్తారా? చంద్రబాబులో లోపాలు ప్రస్తావిస్తే మాత్రమే నిషేధాజ్ఞలు వర్తిస్తాయని కేసులు పెడతారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
నిజంగానే ఈ పాలకమండలికి అంత చిత్తశుద్ధి ఉంటే గనుక.. పూర్తిగా రాజకీయ నాయకుల ప్రసంగాలను నిషేధించాలి. ఏ ఒక్కరూ ఆలయం ఎదుట నిల్చుని మీడియాతో ముచ్చట్లు చెప్పడాన్ని నిషేధించాలి. సినిమా వాళ్లు దర్శనం చేసుకుని.. మా సినిమా సూపర్ హిట్ కావాలని దేవుడిని వేడుకున్నాం లాంటి అసందర్భపు ప్రసంగాల్ని కూడా నిషేధించాలి.
సినిమా వాళ్లు ఆలయం ఎదుట ఒకటి రెండు నిమిషాలు నిల్చున్నా సరే.. వారి వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఖచ్చితంగా దెబ్బతింటూనే ఉంది. కేవలం రాజకీయ ప్రసంగాలు అని కాకుండా.. అన్ని రకాల ప్రెవేటు ముచ్చట్లను ఆలయం ఎదుట నిషేధించేలా ఉత్తర్వులు తెస్తే బాగుంటుంది.
నిజమే…అసలు రాజకీయ ప్రసంగాలకు తిరుమల వేదిక కాకూడదు…
విలాఖరులని నిషేధిస్తే చాలు.. ఇంక ఎవరితో మాట్లాడతారు.. గాల్లో చూస్తో వాళ్ళలో వాళ్ళే మతి చలించినట్టు మాట్లాడుకోవాలి అప్పుడు…
టీటీడీ ఈPఉడు పచ్చకామెర్ల వాళ్ళ సీబీటిలో ఉంది ఇంతే..
అమలు చేసేది ఎవరు?వీ ఐ పీలను నీలాదీసేది ఎవరు?..ముందు గొట్టాలను కిందకు దింపితే సరి.
Call boy jobs available 7997531004
అసలు అక్కడ విలేకరులు ఎందుకు ఉండాలి వారిని రానివ్వకుండా చేస్తే సరిపోతుంది