పుష్ప 2 లెక్కలు ఇవేనా?

సినిమాకు అన్నీ కలిపి అంటే నిర్మాణ వ్యయం, వడ్డీలు కలిసి 475 కోట్లు ఖర్చయింది. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా.

పుష్ప 2 సినిమాకు ఎంత ఖర్చయింది. ఎవరికి ఎంత రెమ్యూనిరేషన్. నిర్మాతలకు ఎంత మిగిలింది? అన్న అనేకానేక ప్రశ్నలు వుండనే వున్నాయి. దీని మీద అనేకానేక అంకెలు వినిపిస్తూనే వున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 లెక్కలు ఇలా వున్నాయి.

సినిమాకు అన్నీ కలిపి అంటే నిర్మాణ వ్యయం, వడ్డీలు కలిసి 475 కోట్లు ఖర్చయింది. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా. డైరక్టర్ ఇనీషియల్ రెమ్యూనిరేషన్ కలిపి.

హీరోకి మొదట్లో టోటల్ బిజినెస్ మీద 27 శాతం అన్నది ఓ మాట. కానీ చివరకు ఫైనల్ చేసింది 24 శాతం. అంటే 240 కోట్లు.

అంటే 475 కోట్లకు ఈ రెండు వందల నలభై కోట్లు యాడ్ చేయాలి. అంటే 715 కోట్లు. టోటల్ మార్కెటింగ్ అమౌంట్ లో మిగిలింది 285 కోట్లు. ఇందులో సగం సుకుమార్ రైటింగ్స్ సంస్థకు. అంటే దగ్గర దగ్గర 140 కోట్లు.

ఈ నూట నలభై కోట్లలో పది శాతం బన్నీ వ్యవహారాలు చూసే వ్యక్తికి ఇవ్వాలి. అంటే నిర్మాతలకు ఇక నికరంగా మిగిలింది సుమారు 125 కోట్లు.

సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు దాదాపు మూడు వంతుల ఏరియాలో. అందువల్ల ఓవర్ ఫ్లస్ వస్తే నిర్మాతలకు లాభం.

లేదూ, సినిమా అనుకున్నట్లు రాక, తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వాల్సి వచ్చినా, లేదా ఏపీ తెలంగాణలో వెనక్కు కట్టాల్సి వచ్చినా అది నిర్మాతల లాభం మీద ప్రభావం చూపిస్తుంది.

మరి అప్పుడు హీరో, దర్శకుడు తమ వాటాలు తగ్గించుకుంటారో లేదో, అది తరువాత సంగతి. ఇప్పటికైతే ఇవీ లెక్కలు అని తెలుస్తోంది.

7 Replies to “పుష్ప 2 లెక్కలు ఇవేనా?”

  1. పshpa 2 డిజిటల్ రైట్స్ ఎంతకూ పోయాయి అనేది కూడా రాయక్షింది అప్పుడు తీసుతుంది ఎంతా రావాలి

Comments are closed.