ఇంట్లో ఓడా.. బయట గెలిచా!

శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అంటే పక్కా మాస్ లీడర్ గా చూస్తారు. ఆయన పాతికేళ్ళకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చూస్తే ఆయన సుదీర్ఘ ప్రస్థానం లో ఎన్నో…

శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అంటే పక్కా మాస్ లీడర్ గా చూస్తారు. ఆయన పాతికేళ్ళకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చూస్తే ఆయన సుదీర్ఘ ప్రస్థానం లో ఎన్నో మలుపులు చూశారు. ఎత్తు పల్లాలు చూసారు.

దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా వైసీపీలో ఉన్నారు. ఆయనది ముక్కుసూటి మనస్తత్వం. ఆయన దూకుడుగా రాజకీయం చేస్తారని పేరు. శ్రీకాకుళంలో బలమైన మరో రాజకీయ కుటుంబం కింజరాపు ఫ్యామిలీ మీద ఆయనది నిరంతర పోరాటం.

తెర వెనక ప్రధాన పార్టీలు అన్నీ కలసి జిల్లాలో రాజకీయాలు చేస్తాయని పేరు. దువ్వాడ మాత్రం తెర ముందూ వెనకా కింజరాపు ఫ్యామిలీతో రాజకీయ యుద్ధమే చేస్తారు. దానిని మెచ్చుకునే వైసీపీ అధినేత ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆయన కూడా శక్తివంచన లేకుండా జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ మీద రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారు.

పార్టీలో ఎంతో ఫ్యూచర్ ఉన్న దువ్వాడ ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన మరో మహిళతో ఉన్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన కుటుంబంలో విభేదాలు వీధిన పడ్డాయి. అవి కొన్నాళ్ల పాటు మీడియాకు మేత కూడా అయ్యాయి. టీవీ సీరియల్ మాదిరిగా దువ్వాడ ఎపిసోడ్ చాన్నాళ్ల పాటు సాగింది.

లేటెస్ట్ గా ఆయన ఒక వెబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలు అన్నీ పంచుకున్నారు. తాను కుటుంబ కలహాలకు బలి అయిపోయాను అంటూ చెప్పుకున్నారు. తాను ఇంట్లో ఓడిన వాడిని అని ఆవేదన వ్యక్తం చేశారు. బయట జనాలు ఆదరించినా కుటుంబం నుంచి మోరల్ గా తనకు సపోర్ట్ లేదని అన్నారు.

తాను టెక్కలిలో ఈసారి గెలిచి ఉండేవాడిని అని టీడీపీ కూటమి ప్రభంజనంలో కూడా తనకు 73 వేల ఓట్లు వేసి ప్రజలు తన అభిమానాన్ని చాటారని గుర్తు చేశారు. జిల్లాలో చాలా మంది టీడీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీలు వస్తే తాను మాత్రం టీడీపీ అభ్యర్ధి ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడుని ముప్పయి వేల మెజారిటీ వద్దనే కట్టడి చేయగలిగాను అంటే ప్రజలు ఇచ్చిన బలం అన్నారు.

తన కుటుంబంలో వారు సహకరించి ఉంటే ఈపాటికి మరింత ఎత్తుకు ఎదిగేవాడిని అన్నారు. గతంలో ఏమి జరిగినా తాను మాత్రం ఎవరికీ ఏ అన్యాయం చేయలేదని దువ్వాడ అన్నారు. తాను వైసీపీ ఉన్నతి కోసం కృషి చేస్తానని అధినాయకత్వం ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటాను అన్నారు.

తన మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని దువ్వాడ అన్నారు. తాను గతంలోనే ఎన్నో కేసులు చూసిన వాడిని అన్నారు. ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో పెద్ద గొంతుకతో ప్రజల తరఫున పోరాటం చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.

13 Replies to “ఇంట్లో ఓడా.. బయట గెలిచా!”

  1. సిగ్గు లేని జన్మ.. భార్య, వయసుకు వచ్చిన ఆడ పిల్లలు ఉండి కూడా మదమెక్కి ఎవత్తినో తగులుకొన్నాడు. మళ్ళీ కుటుంబం మీదనే నెపం వేస్తున్నాడు. పార్టీకి వచ్చిన ఓట్లను తన క్యారక్టర్ చూసి వేసినట్లుగా చెప్పుకొంటున్నాడు.

  2. సి.గ్గు.లేని జన్మ.. భార్య, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉండి కూడా మ.ద.మెక్కి ఎవర్తినో తగులుకున్నాడు. మళ్ళీ కుటుంబం మీదే నెపం వేస్తున్నాడు. పార్టీకి పడిన ఓట్లను తన క్యారెక్టర్ చూసి వేసినట్టుగా చెప్పుకుంటున్నాడు.

Comments are closed.