ధర్మానకి వైసీపీ డెడ్ లైన్?

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా అనేకసార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు వైసీపీ అధినాయకత్వం డెడ్ లైన్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన రెండేళ్ల పాటు రెవిన్యూ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. వైసీపీలో…

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా అనేకసార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావుకు వైసీపీ అధినాయకత్వం డెడ్ లైన్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన రెండేళ్ల పాటు రెవిన్యూ మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. వైసీపీలో 2014 ఎన్నికల ముందు చేరిన ధర్మాన ప్రసాదరావుకు పార్టీ మూడు సార్లు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది.

ఆయన రెండు సార్లు ఓడి 2019లో ఒకసారి గెలిచారు. ఇక ఆయన ఈసారి ఓటమి తరువాత రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. ఆయన వైసీపీ అధినాయకత్వం నిర్వహించే సమీక్షా సమావేశాలకు కూడా రావడం లేదు. వైఎస్సార్ ని ఎక్కువగా అభిమానించే ఆయన పెద్దాయన జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు.

దాంతో ఆయన పార్టీలో ఉన్నట్లా లేనట్లా అని వైసీపీ అధినాయకత్వం వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తూ వస్తున్న వైసీపీ శ్రీకాకుళం విషయంలో ధర్మాన ప్రసాదరావు అభిప్రాయాన్ని కోరిందని టాక్. పార్టీలో కొనసాగితే ఆయన పేరుని ఇంచార్జిగా ప్రకటించాలని చూస్తోంది. ఒక వేళ ఆయన ఇంచార్జిగా చేసేందుకు ఇష్టపడకపోతే వేరే పేరుని సూచించాలని కూడా పార్టీ పెద్దలు కోరారని అంటున్నారు.

ఏ సంగతీ తొందరలో చెప్పాలని ఒక డెడ్ లైన్ విధించారని అంటున్నారు. అయితే ప్రసాదరావు తనకు కొంత టైం కావాలని ఆలోచించుకుని చెబుతాను అని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ధర్మాన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఏ పార్టీలో చేరితే కుమారుడికి ఫ్యూచర్ ఉంటుంది అన్నది ఆయన యోచిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన వైసీపీలో అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు. వైసీపీలో ఆయన కొనసాగుతారా అన్నది అయితే చాలా మందికి డౌట్ గానే ఉంది అని అంటున్నారు. అయితే వైసీపీ అధిష్టానం వైపు నుంచే పావులు కదిపారు కాబట్టి ధర్మాన ప్రసాదరావు ఇపుడు ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు.

ధర్మాన ఏ నిర్ణయం ప్రకటించినా అది రాజకీయంగా సంచలనమే అవుతుంది అని అంటున్నారు. వైఎస్సార్ నుంచి ఎందరో ముఖ్యమంత్రులను చూసిన ధర్మాన జగన్ కేబినెట్ లోనూ సేవలు అందించారు. మేధావిగా పేరు పొందిన ఆయన తీసుకునే ఈ నిర్ణయం ఏమిటి అన్న దాని మీద ఆయన అనుచరులు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

6 Replies to “ధర్మానకి వైసీపీ డెడ్ లైన్?”

  1. వై-ఛీ-పి ఒకళ్ళకి డెడ్లైన్ ఇచ్చే పరిస్థితి లో ఉందా..కామెడీ చేస్తావ్

Comments are closed.