పుష్ప-2.. ఫ్యామిలీస్ కు పూర్తిగా దూరం

వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామని చాలామందికి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా పుష్ప-2 వస్తోంది కదా.. అందరం కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటే జేబుకు చిల్లు పడినట్టే. ఈసారి చిల్లు అనడం కంటే పెద్ద…

వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామని చాలామందికి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా పుష్ప-2 వస్తోంది కదా.. అందరం కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటే జేబుకు చిల్లు పడినట్టే. ఈసారి చిల్లు అనడం కంటే పెద్ద బొక్క అనడం కరెక్టేమో.

అవును.. పుష్ప-2 సినిమాను నైజాంలో మల్టీప్లెక్సులో చూసి ఎంజాయ్ చేయడానికి ఓ మధ్యతరగతి కుటుంబం పెద్ద సాహసమే చేయాలి. తెలుగు సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టికెట్ రేట్లు పెరిగాయి. ఇంకా చెప్పాలంటే, టికెట్ రేట్లు పెంపులో కూడా పుష్ప-2 చరిత్ర సృష్టించింది. ముందుగా నైజాంలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారు. సాధారణంగా బెనిఫిట్ షోకు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే అనుమతి. కానీ పుష్ప-2కు మాత్రం తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సుల్లో 4వ తేదీ రాత్రి 9.30 గంటల షో వేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఒక్క షోకు అన్ని స్క్రీన్స్ లో ఫ్లాట్ గా టికెట్ పై 800 రూపాయలు పెంచుకోవచ్చు.

ఇక మిడ్ నైట్ షోల విషయానికొద్దాం.. 5వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట షో, ఉదయం 4 గంటల ఆటకు కూడా ప్రత్యేక అనుమతిచ్చింది తెలంగాణ సర్కారు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా థియేటర్లు అంటూ లేవు. రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సుల్లో మిడ్-నైట్ షోలు వేసుకోవచ్చు.

సింగిల్ స్క్రీన్స్ పెంపు విషయానికొస్తే.. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (ఫస్ట్ వీకెండ్) టికెట్ రేటుపై 150 రూపాయలు పెంచారు. 9 నుంచి 16వ తేదీ వరకు టికెట్ రేటుపై 105 రూపాయలు పెంచారు. ఇక 17వ తేదీ నుంచి 23 వరకు టికెట్ పై 20 రూపాయలు పెంచారు.

మల్టీప్లెక్సుల్లో రేట్ల పెంపు చూస్తే.. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (ఫస్ట్ వీకెండ్) టికెట్ రేటుపై 200 రూపాయలు పెంచారు. 9 నుంచి 16 తేదీ వరకు 150 రూపాయలు పెంచారు. 17 నుంచి 23వ తేదీ వరకు టికెట్ పై 50 రూపాయలు పెంచారు. వీటన్నింటికీ మళ్లీ జీఎస్టీ అదనం.

ఇప్పుడు ఫ్యామిలీకి అయ్యే ఖర్చు చూద్దాం..

సినిమా రిలీజైన మొదటి వారాంతం (బెనిఫిట్ షో కాకుండా) పుష్ప-2 సినిమాను మల్టీప్లెక్సులో చూడాలనుకుంటే.. నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 2000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇంటర్వెల్ లో స్నాక్స్ కూడా టచ్ చేయాలనుకుంటే.. ఖర్చు కచ్చితంగా 3500 రూపాయలు అవుతుంది.

అదే ఒక రోజు ముందే బెనిఫిట్ షోలో సినిమా చూడాలనుకుంటే.. నలుగురు కుటుంబసభ్యులకు టికెట్లకే 5వేల రూపాయలు అవుతుంది. స్నాక్స్ అదనం.

ఇక సింగిల్ స్క్రీన్స్ విషయానికొద్దాం.. నలుగురు కుటుంబ సభ్యులు ఫస్ట్ వీకెండ్ లో సినిమా చూడాలనుకుంటే.. టికెట్లకే 1500 రూపాయలు అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే, సినిమా రిలీజైన రోజు నుంచి 19 రోజుల పాటు పుష్ప-2 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉండవు. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రతి స్క్రీన్ లో, ప్రతిరోజు టికెట్ పెంపు ఉంటుందన్నమాట.

సాధారణ రేట్లలో సినిమా చూడాలనుకుంటే.. డిసెంబర్ 24వ తేదీ నుంచి మాత్రమే వీలవుతుంది. అక్కడికి మరో నెల రోజులు ఆగితే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

22 Replies to “పుష్ప-2.. ఫ్యామిలీస్ కు పూర్తిగా దూరం”

  1. ఈ కాలం ఆ మాత్రం డబ్బు ప్రతి అడ్డమైన వాళ్ళ దగ్గర ఉన్నాయి.. చూడాలనుకుంటే చూస్తారు.. పుష్ప ఒకటి మరి ఒక గొప్ప కుటుంబ కథా చిత్రం.. ఊ అంటావా ఒక సకలకళా కీర్తన…

  2. ఈ కాలం ఆ మాత్రం డ బ్బు ప్రతి అ డ్డ మైన వాళ్ళ దగ్గర ఉన్నాయి.. చూడాలనుకుంటే చూస్తారు.. పుష్ప ఒకటి మరి ఒక గొప్ప కు టుంబ క థా చి త్రం.. ఊ అంటావా ఒక సకలకళా కీర్తన…

  3. ఈ కా లం ఆ మా త్రం డ బ్బు ప్ర తి అ డ్డ మైన వాళ్ళ దగ్గర ఉన్నాయి.. చూడాలనుకుంటే చూ స్తారు.. పు ష్ప ఒ కటి మరి ఒక గొ ప్ప కు టుంబ క థా చి త్రం.. ఊ అంటావా ఒక స కల క ళా కీర్తన…

  4. డబ్బు మీద నీ అభిప్రాయం ఏంటి?

    అల్లు అర్జున్: నా దగ్గర డబ్బులు ఉన్నాయని పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను వంద రూపాయలు పెట్టి కొనను. దానికి ఎంత విలువో అంతే ఇస్తాను.

    (Unstoppable లో అల్లు అర్జున్ సెలవిచ్చిన ఆణి ముత్యాలు)

  5. సాధారణ రేట్లలో సినిమా చూడాలనుకుంటే.. డిసెంబర్ 24వ తేదీ నుంచి మాత్రమే వీలవుతుంది. అక్కడికి మరో నెల రోజులు ఆగితే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

  6. అంత అర్జెంట్ గా మొదటి వారం లోనే చూసేయాలన్న తొందరెందుకు ? సినిమా అన్నది నిత్యావసర సరుకు కాదు, మనకు నచ్చినప్పుడు, ధరలు అందుబాటులోనికి వచ్చాక చూడటం బెటర్. టికెట్ ధరలు పెంచుకోవడం వ్యాపారం, ఆ ధరకు కొనడం, కొనకపోవడం మన ఇష్టం. నాలుగు సినిమాలు తొలిరోజుల్లో అధిక ధరకు కొని చూడటం మానేస్తే, వాటంతటవే కిందకి దిగుతాయి.

  7. టికెట్ రేట్లు తగ్గిస్తే గవర్నమెంట్ని తిడతారు, పెంచితే సినిమాని తిడతారు ఏంటో ఈ గోల

Comments are closed.