దమ్మున్న కాంబినేషన్లదే ‘దోపిడీ’!

పన్నెండువందలు ఓ సినిమా టికెట్ నా? అంటే.. ఇష్టమైతే చూడు.. కష్టమైతే మానేయ్ అనాల్సి వస్తుంది. టాలీవుడ్ ట్రెండ్ అలా ఉంది.

ఇది అన్యాయం అంటే… అనుభవించు నీ క‌ర్మ‌ అంటాడు.. కవి శ్రీశ్రీ.

పన్నెండువందలు ఓ సినిమా టికెట్ నా? అంటే.. ఇష్టమైతే చూడు.. కష్టమైతే మానేయ్ అనాల్సి వస్తుంది. టాలీవుడ్ ట్రెండ్ అలా ఉంది. కాంబినేషన్లు కీలకం. ఆ కాంబినేషన్ సినిమాకు కంటెంట్ అంతకన్నా కీలకం. కంటెంట్ బాగుంది అనే టాక్ వస్తే టికెట్ రేటు ఎంతన్నది నిర్మాత ఇష్టం. కొనిచూడడం, చూడకపోవడం ప్రేక్షకుడి ఇష్టం.

అభిమాన హీరో, ఏ షో ముందు అయితే ఆ షో చూసేయాలని అభిమానులకు భయంకరమైన కోరికగా ఉంటుంది. ఆ కోరికనే ఇప్పుడు నిర్మాతలు, హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్, అలాగే దర్శకులకు అతి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్ల ఖర్చు వెయ్యి కోట్లకు చేరిపోతోంది. దాని వల్ల అంతకు అంతా వెనక్కు రాబట్టుకోవాలంటే జనాల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం మినహా మరో దారి లేదు.

ఒకప్పుడు బెనిఫిట్ షోలు అనే మాయాజాలం జరిగేది. ఈ బిజినెస్‌తో అవగాహన ఉన్న కొందరు బయ్యర్ దగ్గరకు వెళ్లి ఒక షో కొనుక్కునేవారు. ఆపైన పోలీసు శాఖకు, వివిధ అధికారులకు ఎంతో కొంత ఇచ్చి, థియేటర్ రెంట్ చెల్లించి, ఖర్చులు కలుపుకుని, వెయ్యి, రెండు వేలు రేటు పెట్టి టికెట్లు అమ్మేవారు. పైకి ఏదో ఒక సంస్థకు డొనేషన్ కోసం అనే కలర్ ఇచ్చేవారు. షో వేసుకున్న వారు ఎంతో కొంత లాభం మిగుల్చుకునేవారు.

ఇదిలా సాగుతుంటే, ఇటీవల రెండు మూడు పెద్ద సినిమాలకు ఓ చిన్న ట్రిక్ చేసారు. ఎవరికీ ఏ షోలు ఇవ్వకుండా తామే మొత్తం టికెట్లు ఆఫీసుకు తెప్పించేసుకుని, ఎవరికైనా కావాలంటే వెయ్యి రూపాయల యూనిఫార్మ్ రేటు మీద బల్క్‌గా ఇచ్చేయడం మొదలుపెట్టారు. కానీ అది ఇల్లీగల్. ఒక విధంగా బ్లాక్ అమ్మినట్లే. ఎందుకంటే ఫేస్ వాల్యూ వెయ్యి రూపాయలు ఉండదు కదా.

అందుకే కొన్నాళ్ల నుంచి అధికారికంగా వెయ్యి రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటే దగ్గర దగ్గర 1200 టికెట్ రేటు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవర కు కూడా తెలంగాణలో ఈ ప్రయత్నం చేసారు కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు పుష్ప 2 కి పాజిబుల్ అయింది.

ఇప్పుడు ఫ్యాన్స్ కు పెద్ద ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు బెనిఫిట్ షో లు అంటూ వెయ్యి, పదిహేను వందలు ఇచ్చేవారు. ఇప్పుడు అఫీషియల్ గానే 12 వందలు చెల్లిస్తారు. ఫ్యాన్స్ కాని వారు రెండు మూడు రోజులు ఆగుతారు. సింపుల్ అంతే.

కానీ ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి.

పుష్ప2 సినిమాకు కనుక హీరో బన్నీకి 275 కోట్లు ఇవ్వకుండా వుండి వుంటే, అభిమానులను దృష్టిలో వుంచుకుని బన్నీ ఓ యాభై కోట్లు తగ్గించుకుని వుంటే.. ఇంత రేట్లు అవసరం లేదు. అప్పుడు నైజాం 100 కోట్లకు కాకుండా 70 కోట్లకు అమ్మవచ్చు. అప్పుడు టికెట్ రేట్లు ఇంత అవసరం లేదు. కానీ ఎవరి రెమ్యూనిరేషన్ ఎవరు తగ్గించుకుంటారు.

జనం ఇస్తున్నపుడు నిర్మాతకు నొప్పి ఏమి? హీరోకి ఇవ్వడానికి. అందువల్ల ఇదో సైకిల్. ఈ సైకిల్ లో అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడే. కానీ ప్రేక్షకుడికి ఇప్పుడు ఆప్షన్ వుంది. థియేటర్ లో చూడాలా? ఓటిటీలో చూడాలా అన్నది. ఆ విచక్షణ వాడుకోవడం వాడుకోకపోవడం అన్నది ప్రేక్షకుడి ఇష్టం

ప్రేక్షకుడికి ఇష్టమైనపుడు ఏదైనా మంచిదే.

17 Replies to “దమ్మున్న కాంబినేషన్లదే ‘దోపిడీ’!”

  1. కానీ అదే లాజిక్ ఇలా కూడా చూడొచ్చు.. గుడ్డలు ఇప్పుకుని అన్న కోసం మీరు అన్న కార్యకర్తలు కష్టపడుతున్నారు కష్ట పడ్డ వాళ్ళకి ఫలితం ఇవ్వకపోయినా… Parachute నాయకులు ని అందలం ఎక్కించిన ఏళ్లుగా మంచి చెడు kadu కదా కనీసం అప్పోయింట్మెంట్ ఇవ్వకపోయినా కానీ ఇప్పటికి అన్న కోసం కొట్టు కి చస్తున్నారు… అంటే అది వాళ్ల ఇష్టం… కనీసం సినిమా హీరో ఇచ్చిన వెయ్యకో రెండు వేలకో ఎంటర్టైన్మెంట్ అయినా ఇస్తున్నాడు…. ఇక్కడ అది కుడా లేదు…

  2. అడ్డంగా సంపాదిస్తున్న సొమ్ము కాస్తాయిన ఖర్చు పెట్టాలి..ఒక కారు కొనాలంటే ఎంత ఒరయాస ఉండేది గతం లో…బోడి మోటార్ సైకిల్ ధరలు పది కార్ల ఖరీడుండేవి కొనేసి బలాదూరువా తిరుగుతున్నారు..

  3. అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడే. కానీ ప్రేక్షకుడికి ఇప్పుడు ఆప్షన్ వుంది. థియేటర్ లో చూడాలా? ఓటిటీలో చూడాలా అన్నది.

  4. Movie ticket yentaina petti chavani ishtam ayite choostam Ledante vere options untay. Konchem schools, hospitals lo kharchu taggite baguntundi. Govt hospitals schools ki vellela situation levu. Ikkademo dopidi. Nenu aa fan. 4am show ki banglore lo 1000 undi evening ayite 250 undi. Evening ne choosta. Dabbulu oorike ravu kada.

  5. నీ బాధ ఏమిట్రా బాబూ! చేతినిండా డబ్బు, దురద ఉన్నవాడు వెళ్లి సినిమా చూస్తాడు. ఆ థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే ఇంట్లో కూచుని రేట్స్ తగ్గాక చూస్తాడు. అదీ కాక్పోతే ఒటీటీలో వచ్చాక చూస్తాడు. పుష్ప 2 లాంటి సినిమాలు చూడకపోతే కామన్ మాన్‌కి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు ఏడవాల్సింది పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి ఎసెన్షియల్ కమాడిటీస్ ధర పెరిగినపుడు. కానీ ఆ పని ఎప్పుడూ చేసిన ఙాపకం లేదు.

  6. నీ బాధ ఏమిట్రా బాబూ! చేతినిండా డబ్బు, దు..ర..ద ఉన్నవాడు వెళ్లి సినిమా చూస్తాడు. ఆ థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే ఇంట్లో కూచుని రేట్స్ తగ్గాక చూస్తాడు. అదీ కాకపోతే ఒటీటీలో వచ్చాక చూస్తాడు. పుష్ప 2 లాంటి సినిమాలు చూడకపోతే కామన్ మాన్‌కి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు ఏడవాల్సింది ప..ప్పు, ఉ..ప్పు, కూరగాయలు వంటి ఎసెన్షియల్ కమాడిటీస్ ధర పెరిగినపుడు. కానీ ఆ పని ఎప్పుడూ చేసిన ఙాపకం లేదు.

  7. నీ బాధ ఏమిట్రా బాబూ! చేతినిండా డబ్బు, దు..ర..ద ఉన్నవాడు వెళ్లి సినిమా చూస్తాడు. ఆ థియెట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే ఇంట్లో కూచుని రే..ట్స్ తగ్గాక చూస్తాడు. అదీ కాకపోతే ఒటీటీలో వచ్చాక చూస్తాడు. పుష్ప 2 లాంటి సినిమాలు చూడకపోతే కా..మ..న్ మా..న్‌కి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు బాధ పడాల్సింది ప..ప్పు, ఉ..ప్పు, కూరగాయలు వంటి essential commodities ధర పెరిగినపుడు. కానీ ఆ పని ఎప్పుడూ చేసిన ఙాపకం లేదు.

Comments are closed.