ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌

బీసీ ఉద్య‌మ నాయ‌కుడు ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కానున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు స‌భ్యుల్లో రాజీనామా చేసిన వారిలో…

బీసీ ఉద్య‌మ నాయ‌కుడు ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కానున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు స‌భ్యుల్లో రాజీనామా చేసిన వారిలో ఆర్‌.కృష్ణ‌య్య కూడా ఉన్నారు. తాజాగా ఖాళీ ఏర్ప‌డిన మూడుస్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

వీటిలో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజీనామాతో ఖాళీ ఏర్ప‌డిన స్థానం మాత్ర‌మే ఇత‌రుల‌తో భ‌ర్తీ కానుంది. ఇది కూడా టీడీపీకే ద‌క్క‌నుంది. మూడింటిలో రెండు టీడీపీకి, ఒక‌టి బీజేపీకి అనుకున్నారు. బీజేపీ అభ్య‌ర్థి ఎవ‌రో అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రెండు రోజుల క్రితం ప్ర‌క‌టించారు. చివ‌రికి ఆర్‌.కృష్ణ‌య్య‌తో ఆ సీటు భ‌ర్తీ చేయనున్నార‌ని తెలిసింది.

2014లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆర్‌.కృష్ణ‌య్య అనూహ్యంగా తెలంగాణ‌లో టీడీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచి గెలుపొందారు. ఆ త‌ర్వాత టీడీపీకి రాజీనామా చేశారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌ర‌చుకున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వైసీపీ అధికారానికి దూరం కావ‌డంతో ఆ పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. బీసీ ఉద్య‌మ నాయ‌కుడిగా ఎంతో గౌర‌వాన్ని సంపాదించుకున్న ఆర్‌.కృష్ణ‌య్య‌, రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాక‌, ఏమ‌వుతున్న‌దో అంద‌రూ చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయ‌న ఇంకెన్ని ర‌కాలుగా మార‌నున్నారో!

16 Replies to “ముచ్చ‌ట‌గా మూడో పార్టీ కండువా క‌ప్పుకోనున్న ఆర్‌.కృష్ణ‌య్య‌”

  1. మీరు బిసిప్రజల మేలు కోరే వ్యక్తి, మీరు ఏదైనా చేస్తున్నారు అంటే బీసీ ల కోసమే అని మాకు తెలుసు. మీ లాంటి నాయకులు బీసీలకు అవసరము. జై కృష్ణయ్య. జై బీజేపీ.

  2. ఓ రకంగా మెచ్చుకోవాలి పదవికి రాజీనామా చేసి పార్టీ మారి పదవి తీసుకొవడం

  3. మూడు కాదు సోదరా నాలుగో పార్టీ. 2018లో మిరియాలగుడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అన్నట్లు ఇతను వైసీపీలో చేరి బాబుని తిట్టినపుడు నువ్వు తెగ ఆనందపడినట్లున్నావ్?

  4. ఆర్ కృష్ణయ్య లాంటి, గాలికి కొట్టుకుపోయే ఎంగిలి విస్తరాకులను చేర్చుకుని, బీజేపీ ఏమి సాధించదలచిందో కనీసం వాళ్ళ అధినాయకత్వానికైనా అర్ధం అయిందో లేదో సందేహమే !

    కన్నా లక్ష్మీనారాయణను చేర్చుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకున్నారు. దమ్మిడీ లాభం లేకపోగా గిట్టుబాటు అయినంతవరకూ ఉండి బయటికి దూకేసారు. ధర్మపురి అరవింద్, ఈటెల రాజేంద్ర, రఘునందన్, అరుణ లాంటి వారు ఎంత ఏడిపించారో చూసారు. అయినా ఈ ఎంగిలివిస్తరాకుల మీద కక్కుర్తి దేనికి ?

    ఇప్పటికే ఆంధ్ర బీజేపీ మొత్తం ఎంగిలి విస్తరాకుల మయం. ఉన్న డూప్లికేట్ టీడీపీఎంగిలి విస్తరాకులు చాలకా, ఈ కొత్త విస్తరాకు ?

    వాపు ఎప్పటికీ బలం కాదు. అవకాశవాది ఎప్పటికీ పార్టికి బలం కాబోడు

Comments are closed.