అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే విషయంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
తడి బూడిత తరలింపులో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అంతా తానే తరలించుకెళ్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి పంతం పట్టారని, స్థానిక అవసరాలు తీరిన తర్వాతే తీసుకెళ్లాలనే తమ మాటను ఆయన పట్టించుకోవడం లేదని ఆదినారాయణరెడ్డి అంటున్నారు. ఇద్దరి మధ్య రచ్చ బజారుకెక్కడంతో చివరికి పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఇద్దర్నీ సీఎంవో అధికారులు పిలవగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి డుమ్మా కొట్టారు.
ఈ నేపథ్యంలో శనివారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు విమానాశ్రయంలో అస్మిత్‌రెడ్డి కనిపించారు. అస్మిత్‌రెడ్డికి క్లాస్ పీకినట్టు వార్తలొచ్చాయి. బూడిద తరలింపులో స్థానిక అవసరాలను, ఇబ్బందులను పట్టించుకోకుండా జేసీ రౌడీయిజం చేస్తున్నారనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలిసింది. అందుకే బజారుకెక్కి, కూటమి ప్రభుత్వ పరువు తీస్తున్నారంటూ అస్మిత్‌రెడ్డిపై మండిపడినట్టు తెలిసింది.
సమస్య వుంటే కూచుని సామరస్యంగా కూచుని మాట్లాడుకోవాలని చంద్రబాబు హితవు చెప్పడం విశేషం. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దయతలిస్తే ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే అవకాశం వుంది. లేదంటే మళ్లీ గొడవ మొదటికొస్తుందని చెప్పక తప్పదు.
Call boy jobs available 7997531004