మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అసమానతల నుంచి పుట్టిందే మహిళా ఉద్యమం. తమకూ కొన్ని హక్కులు కావాలంటూ న్యూయార్క్ లో 15వేల మందికి పైగా మహిళలు ధర్నా చేశారు.

అడ్డా మీద పనిచేసే కూలీల్లో కూడా ఆడ-మగ తేడాలు చూస్తున్నారు. మగాడికి ఒక కూలీ, అంతకంటే తక్కువగా మహిళకు కూలి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే, వందేళ్ల కిందట స్త్రీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు వెట్టి చాకిరీ చేసింది వీళ్లే. పురుషుడు 10 గంటలు పనిచేస్తే, స్త్రీ మరో 2 గంటలు అదనంగా పనిచేయాలనే రూల్ ఉండేది. వేతనం మాత్రం పురుషుడి కంటే తక్కువ. అంతేకాదు, ఒకప్పుడు మహిళలకు ఓటు హక్కు కూడా లేదు.

ఈ అసమానతల నుంచి పుట్టిందే మహిళా ఉద్యమం. తమకూ కొన్ని హక్కులు కావాలంటూ న్యూయార్క్ లో 15వేల మందికి పైగా మహిళలు ధర్నా చేశారు. 1908లో జరిగిందిది. ఆ తర్వాత ఏడాదికి అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ మహిళలకు కొన్ని హక్కులిచ్చింది.

దీనికి గుర్తుగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన క్లారా జెట్కిన్ అనే మహిళది. 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు.

1911లోనే జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించినప్పటికీ.. ఐక్యరాజ్య సమితి మాత్రం దీన్ని 1975లో గుర్తించింది. ఐరాస గుర్తింపు తర్వాత ఇది ప్రపంచవ్యాప్తమైంది.

1917.. రష్యాలో జోరుగా యుద్ధం సాగుతున్న సమయం. పురుషులకు ఎక్కువ ఆహారం, మహిళలకు తక్కువ ఆహారం ఇచ్చేవారు. అలా సరిగ్గా భోజనం అందక ఎంతోమంది మహిళలు చనిపోయారు. దీంతో ఆహారం కోసం ఉద్యమం వచ్చింది. ఏకంగా అప్పటి రష్యా చక్రవర్తి తన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం, మహిళలకు ఆహారంతో పాటు, ఓటు వేసే హక్కు ఇచ్చింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8.

అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరిట ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేసేవారు మహిళలు. తమ హక్కుల కోసం పోరాడేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అది వేడుకగా మారిపోయింది. ధర్నాల స్థానంలో సంబరాలు వచ్చాయి.

5 Replies to “మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?”

  1. తండ్రి నీ లేపేసి నా వాడు విసిరేసిన బిచ్చం కోసం

    వైఎస్ విజయమ్మ కి కనీసం మాట సాయం చేసే దమ్ము లేని సిగ్గు లేని వైఎస్ఆర్ అభిమాన గుంపు.

Comments are closed.