Advertisement

Advertisement


Home > Politics - National

ఇంటి పని చేయమని భార్యను అడిగితే నేరమా..?

ఇంటి పని చేయమని భార్యను అడిగితే నేరమా..?

జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి చట్టంలో రక్షణ ఉందిప్పుడు. ఈ చట్టాలు ఎంత రక్షణ కల్పిస్తాయో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతున్నాయి. ఇది అలాంటి ఉదంతమే. భర్త, తనను హింసిస్తున్నాడంటూ భార్య కోర్టుకెక్కింది. అది గృహ హింస కాదని, కేవలం ఇంటి పని చేయమని మాత్రమే తను చెప్పానని భర్త వాదించాడు. దీన్ని భార్య అంగీకరించలేదు. ఈ కేసు ఏకంగా హైకోర్టు వరకు వెళ్లింది.

ఢిల్లీకి చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది, వాళ్లకు 2008లో ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే భార్య మాత్రం పెళ్లయినప్పట్నుంచి ఇంటి పని చేయడానికి నిరాకరించింది. అది తన హక్కులకు విరుద్ధమని వాదించింది. ఎన్నోసార్లు భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కొడుకును కూడా చూడనివ్వలేదు.

దీంతో భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకులు ఇవ్వాల్సిందిగా అర్థించాడు. అయితే భార్య వాదనతోనే ఫ్యామిలీ కోర్టు ఏకీభవించింది. మహిళ చెప్పిన మాటల్నే విశ్వసించింది. దీంతో భర్త హైకోర్టుకు వెళ్లాడు.

వాదనలు విన్న హైకోర్టు, భార్య వైఖరిని తప్పుబట్టింది. ఒక వివాహితను ఇంటి పని చేయమని అడిగితే, ఆమెను పనిమనిషి కింద చూసినట్టు కాదని అభిప్రాయపడింది కోర్టు. ఇంటి పని చేయడం ద్వారా కుటుంబం పట్ల తన ప్రేమను వివాహిక వ్యక్తం చేసినట్టు అవుతుందని తెలిపింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం ఆలుమగలు ఇద్దరూ బాధ్యతల్ని సరిసమానంగా పంచుకోవాలని, విధుల నుంచి భార్య తప్పుకోవడం తప్పు అవుతుందని తెలిపిన కోర్టు.. భర్తకు దూరంగా పుట్టింటిలో భార్య ఉండడంపై అభ్యంతరం తెలిపింది.

వైవాహిక బంధాన్ని నిలుపుకునేందుకు భర్త వేరు కాపురం పెట్టినప్పటికీ, ఎందుకు రాలేదని భార్యను ప్రశ్నించింది కోర్టు. ఇంటి చాకిరీ మొత్తం చేయాల్సి వస్తుందంటూ భార్య తరఫు లాయర్ చెప్పిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, భర్తకు విడాకులు మంజూరు చేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?