భారత ప్రభుత్వం, భారత సైన్యం ఎంత అద్భుతమైనటువంటి, ప్రశంసార్హమైనటువంటి సంయమనం పాటిస్తున్నదో ‘ఆపరేషన్ సింధూర్’ దాడులను జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థం అవుతుంది. పీఓకేలో ప్రత్యేకించి.. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసేలా.. ప్రిసిషన్ గైడెడ్ మిసైళ్లను భారత సైన్యం ప్రయోగించింది. ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు కూడా.
ఎక్కడా పాక్ పౌరులు ఉన్న ప్రాంతాల్లో గానీ, పాకిస్తాన్ కు చెందిన సైనిక స్థావరాల మీద గానీ.. ఎలాంటి దాడులు నిర్వహించలేదని తేల్చి చెప్పారు. ఇది భారత్ ప్రదర్శించిన గొప్ప సంయమనంగా, అనుసరించిన రాజనీతిగా ఇప్పుడు ప్రపంచదేశాలు గమనిస్తున్నాయి.
పాకిస్తాన్ ను యుద్ధానికి రెచ్చగొట్టే ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, అనవసరమైన సమస్యలకు దారితీయకుండా ఉండే విధంగా.. కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే దాడులు చేసినట్టుగా భారత సైన్యం విస్పష్టంగా ప్రకటించింది. కోట్లి, భీంబేర్, చకమ్రు తదితర ప్రాంతాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాల మీద మాత్రమే ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది.
ఎంతటి సంయమనంతో భారత్ కేవలం ఉగ్రవాదం మీదనే పోరు సాగిస్తున్నప్పటికీ.. పాకిస్తాన్ సవ్యంగా స్పందిస్తుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే ఈ దాడులకు సరైన ప్రతీకార దాడులు ఉంటాయని పాక్ ప్రకటిస్తోంది. పాకిస్తాన్ ప్రధానికూడా స్పందిస్తూ.. దీటైన జవాబిస్తామని అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ లోని లాహోర్ తో పాటు, మరొక ఎయిర్ పోర్టును కూడా 48 గంటల పాటు మూసేశారు.
దాడులు జరిగిన వెంటనే.. పూంఛ్ రాజౌరీ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అలాగే ఎల్ ఓ సీ వెంట ఫిరంగుల కాల్పులు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం సన్నద్ధంగా ఉందని కూడా సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకారం పేరుతో ఎలాంటి కవ్వింపు చర్యలు జరిగినా సరే.. అణిచివేయడానికి సరిహద్దు వెంబడి వైమానిక యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కేవలం ఉగ్రవాదం మీద పోరాటం తప్ప.. పాకిస్తాన్ పౌర సమాజం జోలికి వెళ్లకుండా భారత్ సంయమనం పాటిస్తున్నప్పటికీ.. అదే సమయంలో.. పాక్ రెచ్చిపోతే తిప్పికొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది.
Excellent decision.. Pak should not go blind n should cooperate to punish terrorists
This is not first time and this is not last time. They don’t take any action against terrorism. That is the sad truth
True. it is failed democracy .they cant take sides of people ..they will definetly take side of terrorist’s .. We should be more vigilant and more careful now .. and They have agreed on global forum that they are doing this dirty business from long time.
Expecting impossible things from pakistan !! You should understand that Pak army is tightly coupled with terrorism.