తప్పుడు ప్రచారాలతో చెలరేగుతున్న పాకిస్తాన్!

పాక్ ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందూత్వం మీద పగబట్టినట్టుగా చేసిన దాడులుగా ఈ పహల్గాం దాడులు సంచలనం సృష్టించాయి.

ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు పుడుతోంది. కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలు మీద మాత్రం దాడులు నిర్వహించింది. తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో లక్ష్యించిన ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా.. భారత సైన్యం ప్రకటించింది.

అయితే పాకిస్తాన్ మాత్రం.. భారత్ మీద దుష్ప్రచారం చేయడానికి పూనుకుంటోంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమ సైన్యం దీటుగా ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు.

భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 1.28 గంటలకు దాడులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 1.44 కు స్ట్రైక్స్ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురీ 4.0 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆరు ప్రాంతాల్లో 24 దాడులు జరిగినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే కొందరు పాక్ పౌరులు మరణించినట్టుగా ఆయన చెప్పడం విశేషం. అలాగే.. భవాల్పూర్ లోని అహ్మద్ పూర్ అనే చోట సుభాన్ మసీదు మీద, ముజఫరాబాద్ లో బిలాల్ మసీదు మీద కూడా దాడి జరిగినట్టుగా షరీఫ్ చౌధురి ప్రకటించడం.. కుట్రపూరితమైన ఎత్తుగడగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఎందుకంటే.. భారత్ ఈ దాడుల్లో అత్యంత కచ్చితత్వానికి మారుపేరు అయిన హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించింది. ఇవి కించిత్తు పొరబాటు కూడా చేయకుండా లక్ష్యించిన టార్గెట్స్ మీద మాత్రమే దాడులు చేసే ఆయుధాలుగా పేరుంది. అయితే మసీదు మీద దాడి జరిగినట్టుగా, ఆ మసీదులో ఉన్న పౌరులు, ఓ ఆరేళ్ల పసిపాప కూడా మరణించినట్టుగా షరీఫ్ చౌధరీ చేస్తున్న ప్రకటన కేవలం అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్ఠించడానికి మాత్రమే జరుగుతున్నదనేది నిజం.

పహల్గాం లో పర్యాటకుల మీద దాడిచేసిన పాక్ ఉగ్రవాదులు వారిని ‘నీ మతం ఏమిటి’ అని అడిగి మరీ.. హిందువుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే కాల్చి అంతమొందించిన సంగతి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.

పాక్ ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందూత్వం మీద పగబట్టినట్టుగా చేసిన దాడులుగా ఈ పహల్గాం దాడులు సంచలనం సృష్టించాయి. దీనికి సమాధానంగా.. తమ మసీదు మీద భారత సైన్యం దాడులు చేసినట్టుగా రంగుపులిమి.. మతపరమైన సానుభూతి పొందడానికే పాక్ ఇలాంటి కుట్రపూరిత అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. పైగా ఇలాంటి తప్పుడు ప్రకటనల ద్వారా.. అంతర్జాతీయంగా ముస్లిం దేశాల మద్దతు కూడగట్టవచ్చునని పాక్ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే రెండు భారత ఫైటర్ జెట్లను కూడా నేలకూల్చినట్టు ఆయన ప్రకటించారు. అయితే ఇవన్నీ కూడా పాక్ చేసిన బూటకపు ప్రకటనలుగానే అందరూ భావిస్తున్నారు.

5 Replies to “తప్పుడు ప్రచారాలతో చెలరేగుతున్న పాకిస్తాన్!”

    1. Ippudu sakshi tv enduku boss. internal issues are seperate . If it comes to nation all were united. Will fight tdp vs YCP later. Dont bring this kind of comments on national topics

  1. సాక్షి టీవీ ఈశ్వర్ గాడిని అక్కడకి పంపిస్తే సరిపోద్ది .. వాడైతేనే తిప్పికొట్టగలడు .

Comments are closed.