పిరేట్స్ ఆఫ్ ది కరెబియన్ సినిమాల హీరో జానిడెప్ అందరికీ తెలుసు. జాక్‌స్పారోగా ఆయన పాత్రకి కోట్ల అభిమానులున్నారు. ఇంగ్లండ్ బర్మింగ్‌హామ్‌లోని ఇండియన్ రెస్టారెంట్ వారణాసిలో డెప్ మొన్న ఆదివారం (జూన్ 5) పార్టీ చేసుకున్నాడు. బిల్లు రూ.48 లక్షలు. ఆయన కోసమే హోటల్ మొత్తం బుక్ చేసినందుకు అదనంగా రూ.19 లక్షలు. ఇది కాకుండా టిప్‌లు కలిపి టోటల్ రూ.80 లక్షలు అయినట్టు సమాచారం. (హోటల్ బిల్లు 70 వేల పౌండ్లు ప్లస్ టిప్స్)
డెప్ కోసం 240 మంది రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసి, మరుసటి రోజు వాళ్లకి ఫ్రీ ఫుడ్ ఆఫర్ చేశారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్లో డెప్ కేవలం 12 మంది మిత్రులతో వచ్చాడు. ఆయన రాకకి ముందు పర్సనల్ సెక్యూరిటీ వచ్చి రెస్టారెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
డెప్ వస్తున్నాడనే ఆనందంలో హోటల్ ఓనర్ హుస్సేన్ తన కుటుంబ మిత్రులు 60 మందిని పిలిచాడు. ప్రతి ఒక్కరితో డెప్ ఫొటోలు తీసుకున్నాడు.
చికెన్ టిక్కా, సమోసా, బటర్ చికెన్ మొదలైన ఇండియన్ స్పెషల్స్ డెప్ తిన్నాడు. ఈ పార్టీకి కారణం ఏమంటే ఆయన మాజీ భార్య వేసిన వేధింపుల కేసు నుంచి ఈ మధ్య డెప్ విముక్తుడయ్యాడు.
బర్మింగ్ హామ్ బ్రాడ్ స్ట్రీట్‌లో ఉన్న ఖరీదైన ఇండియన్ రెస్టారెంట్ వారణాసి. ఆరేళ్లుగా హుస్సేన్ నడుపుతున్నాడు.
1945లో మొదటిసారి అజీజ్ అనే ఇండియన్ మొదటి రెస్టారెంట్‌ను బర్మింగ్‌హామ్‌లో స్టార్ట్ చేశాడు. 1970 నాటికి వీటి సంఖ్య పెరిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశీయులు స్టార్ట్ చేశారు. హాలీవుడ్ స్టార్స్‌కి ఇష్టమైన రెస్టారెంట్స్‌గా మారిపోయాయి. టామ్ క్రూయిజ్ ఇష్టమైన కర్రీ చికెన్ టిక్కా మసాలా.
వారణాసి సంవత్సరం టర్నోవర్ 40 లక్షల పౌండ్స్. (38 కోట్ల 89 లక్షలు)