కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే!

కర్ణాటక నూతన సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధరామ‌య్య పేరు దాదాపుగా ఖ‌రారైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాజీ…

కర్ణాటక నూతన సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధరామ‌య్య పేరు దాదాపుగా ఖ‌రారైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామ‌య్య‌ వైపే మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. 

సీఎంగా సిద్ధ‌రామ‌య్య పేరును ఖ‌రారు చేయ‌డంతో… డీకే శివ‌కుమార్ కు ఉప‌ముఖ్య‌మంత్రితో పాటు రెండు కీల‌క మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు ఆయ‌న్నే క‌ర్ణాట‌క పీసీసీ అధ్య‌క్షుడిగా కొనసాగించ‌నున్నారు. కాగా మే 18న సిద్ధరామ‌య్య సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉంటారనే పేరు డీకే శివకుమార్‌కు ఉంది. తొలి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ వస్తున్నారు. కాక‌పోతే డీకే శివకుమార్ కు అతనిపై ఉన్న కేసులు సీఎం పదవి అదిరోహించడానికి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. శివకుమార్‌పై పెండింగ్‌లో 19 కేసులు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ కేసుల్లో అరెస్ట్ అయి కొన్ని నెల‌ల పాటు జైల్లో ఉండి వ‌చ్చారు. దీనికితోడు 135 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధ‌రామ‌య్యకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.