Advertisement

Advertisement


Home > Politics - National

నీతూబాయి కిరాణ.. ఆ ఒక్కటే అమ్ముతారు

నీతూబాయి కిరాణ.. ఆ ఒక్కటే అమ్ముతారు

సాధారణంగా కిరాణ షాపులో నిత్యావసర సరకులు అమ్ముతారు. కానీ హైటెక్ సిటీకి దగ్గర్లో ఉన్న నీతూబాయి కిరాణ షాపులో ఒకే ఒక్కటి అమ్ముతారు. అదే గంజాయి. అది కూడా సీక్రెట్ గా కాదు, ముందే చెప్పుకున్నాం కదా, కిరాణ షాపులా తెరిచి మరీ అమ్ముతున్నారు.

హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న నానక్ రామ్ గూడలో ఈ గంజాయి కిరాణ షాపు వెలిసింది. తెల్లారితే ఇక్కడ గంజాయి కొనుగోలు చేసేందుకు కుర్రాళ్లు క్యూ కడతారు. గ్రాముకు ఇంత అని లెక్కకట్టి, తూకం వేసి మరీ గంజాయి ఇస్తారు. ఇదంతా మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం..

ఎలా బయటపడింది.. హైదరాబాద్ నడిబొడ్డున షాపు ఓపెన్ చేసి గంజాయి అమ్ముతోంది నీతూబాయి అనే మహిళ. ఎక్కడెక్కడ్నుంచో ఇక్కడకు వచ్చి గంజాయి కొనుక్కొని వెళ్తుంటారు. కానీ స్థానికంగా ఉన్న పోలీసులకు మాత్రం ఈ విషయం తెలియలేదు. ఎప్పట్లానే నీతూబాయి తన గంజాయి కిరాణ ఓపెన్ చేసింది. ములుగు నుంచి గంజాయి కొనేందుకు కుర్రాళ్లు వచ్చారు. ఇదేదో హైదరాబాద్ పక్కన లేదు. 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ్నుంచి వచ్చి మరీ ఎంచక్కా గంజాయి కొనుక్కొని, ఆర్టీసీ బస్సులో ఇంటికెళ్లారు వీళ్లంతా.

అయితే అలా కొనుగోలు చేసిన గంజాయిని తిరిగి అమ్ముతుండగా సిద్ధిపేటలో దొరికిపోయారు. వీళ్లు చెప్పేంతవరకు హైటెక్ సిటీ సమీపంలో ఓపెన్ గా గంజాయి అమ్ముతున్నారనే విషయం పోలీసులకు తెలియదు. అప్పటికీ నమ్మబుద్ధికాక సిద్ధిపేట నుంచి ముగ్గురు పోలీసుల్ని పంపించారు. వాళ్లు చెప్పింది నిజమే. స్వయంగా పోలీసులు క్యూలో నిల్చొని, గంజాయి కొనుక్కొని వచ్చారు.

ఎలా దొరికింది... దీంతో విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు చేరవేశారు. ఈసారి పక్కాగా స్కెచ్ వేశారు పోలీసులు. ఎందుకంటే, ఆమె షాపు 4 అంచెల్లో ఉంది. ప్రతి అంచెలో ఇనుప గ్రిల్స్ ఉన్నాయి. ఒకేసారి దాడిచేస్తే, చివరి అంచెలో ఉన్న గంజాయిని పక్కనే ఉన్న మ్యాన్ హోల్ తెరిచి నాలాలో పడేస్తారు.

అందుకే ఈసారి పోలీసులు నాలా కార్మికుల్ని కూడా తీసుకెళ్లారు. దాడి చేయడానికి వెళ్లేముందే అన్ని పక్కాగా నిర్థారించుకున్నారు. అయితే పోలీసులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఓపెన్ గానే గంజాయి బుట్టలు పెట్టుకొని, కౌంటర్ ఓపెన్ చేసింది నీతూబాయి. పోలీసులకు స్పాట్ లో 16 లక్షల క్యాష్, భారీగా గంజాయి దొరికింది. అవన్నీ సీజ్ చేసి నీతుబాయిని అదుపులోకి తీసుకున్నారు.

ఈమె గంజాయి లేడీ.. ఇంతకీ ఈ నీతుబాయి ఎవరో తెలుసా.. ఈమె ఈ వ్యాపారంలో పండిపోయింది. 2017 నుంచి ఇదే వృత్తిలో ఉంది. ఆమెపై ఏకంగా 12 కేసులున్నాయి. ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించింది. బయటకొచ్చి మళ్లీ ఇదే దందా మొదలుపెడింది. ఈసారి ఏకంగా ఆరుబయటే గంజాయి అమ్మకం పెట్టింది. శిక్షలు సింపుల్ గా ఇలానే నడిరోడ్డుపై గంజాయి అమ్ముతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?