‘మండే’ నుంచి మెటా మంటలు

సోమవారం నుంచి 10 రోజుల పాటు దాదాపు 3600 మంది ఉద్యోగుల్ని తొలిగించే ప్లాన్ ను అమలు చేయబోతున్నారు.

కొత్త ఏడాది వచ్చింది, మరోసారి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. ఇన్ఫోసిస్ కంపెనీ వందల కొద్దీ ఫ్రెషర్లను తొలిగించిందనే వార్తలు మరిచిపోకముందే, మరోసారి మెటా తెరపైకొచ్చింది. సోమవారం నుంచి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని బయటకు పంపించే కార్యక్రమం మొదలుపెట్టబోతోంది.

ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటాలో ఉద్యోగుల తొలిగింపు ఏడాదిన్నరగా భారీగా జరుగుతోంది. గతేడాది వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలిగించిన ఈ సంస్థ, సోమవారం నుంచి ఈ ఏడాది లే-ఆఫ్స్ కు శ్రీకారం చుట్టబోతోంది.

అమెరికాతో పాటు ఆఫ్రికా, యూరోప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాల్లో మెటా ఉద్యోగులకు సోమవారం నుంచి పింక్ స్లిప్పులు అందబోతున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం, ఉదయం 5 గంటల నుంచే హిట్ లిస్ట్ లో ఉన్న ఉద్యోగులకు మెయిల్స్ వస్తాయి.

ప్రస్తుతానికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్ దేశాల్లో పనిచేస్తున్న మెటా ఉద్యోగులు సేఫ్. ఎందుకంటే, ఆ దేశంలో స్థానిక చట్టాలు ఉద్యోగులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఓవైపు ఉద్యోగుల్ని తొలిగించే ప్రక్రియ కొనసాగిస్తూనే, ఇంకోవైపు మెషీన్ లెర్నింగ్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు సంస్థ సిద్ధమౌతోంది.

తాజా సమాచారం ప్రకారం, సోమవారం నుంచి 10 రోజుల పాటు దాదాపు 3600 మంది ఉద్యోగుల్ని తొలిగించే ప్లాన్ ను అమలు చేయబోతున్నారు. ఏడాదిగా తమ అంచనాల్ని అందుకోలేకపోయిన ఉద్యోగులు ఇంటికెళ్తారని మెటా వర్గాలు తెలిపాయి.

3 Replies to “‘మండే’ నుంచి మెటా మంటలు”

  1. వీడి శాడిజం. అక్కడ ఉద్యోగాలు పోతాయంటే నువ్వు ఎందుకురా బాబు ఈ ఆనందం. ఆ మంటల్లో చలికాసుకోవటం ఏమిటో ఈ ఖర్మ

Comments are closed.