హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా పాటలు మంచి స్పందన పొందాయి. ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి రీజన్ కామెడీ. దీతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సెప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు కొందరు హీరోలను సంప్రదించాం. లేడీ గెటప్ చేయడం అంత ఈజీ కాదు. విశ్వక్ చేస్తానని చెప్పడంతో నాకూ ఇంట్రెస్ట్ కలిగి ముందుకు తీసుకెళ్లాం.
ఫస్ట్ హాఫ్ అంతా సోను వుంటాడు. తన లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ లో వుంటుంది. అనుకోని కారణంగా తనని లైలాగా మార్చుకొని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ రీజన్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.
విశ్వక్ లైలా గెటప్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని అంటున్నారు. నా వరకూ లైలాకే ఎక్కువ మార్కులు వేస్తాను.
అడల్ట్ కామెడీ అన్ని చోట్ల వుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే కదా? దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్, కొందరికి అర్థం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వలన ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ సినిమాలో అడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది.
యూత్ ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం.
మెగాస్టార్ – అనిల్ రావిపూడి సినిమా మే, జూన్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్ లో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలా వుంటుంది.
ప్రస్తుత పరిస్థితుల గురించి ఫ్రాంక్ గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇబ్బందిగానే వుంది. మనం అనుకున్న బడ్జెట్ లో చూసుకుంటే హ్యాపీ. పెరిగితే ఎవరికైనా ఇబ్బందే.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,