డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్ష స్థానానికి ఎంకే స్టాలిన్ ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికలలో భాగంగా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్, కోశాధికారిగా టిఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు.
69 ఏళ్ల స్టాలిన్, దివంగత పార్టీ పితామహుడు ఎం కరుణానిధి చిన్న కుమారుడు, డీఎంకే కోశాధికారి మరియు యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ డీఎంకే రెండోసారి అధ్యక్ష పగ్గాలు చెపడుతున్నారు.