ఎట్టకేలకు భారత్ సంతతి వ్యక్తికి బ్రిటన్ ప్రధాన మంత్రి వరించింది. దాదాపు 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్లో రిషి సునక్‌కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించింది. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలవనున్నారు.రిషి సునక్ అక్టోబర్ 28న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
బోరిస్ జాన్సన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేశారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సునాక్ కు మార్గం సులువైంది.
200 ఏళ్లకు పైగా భారత్‌ను ఏలిన బ్రిటన్ కు భారత సంతతి వ్యక్తి పాలించడం ఇదే తొలిసారి. సూర్యుడు అస్తమించని రాజ్యంగా విలసిల్లిన ఆ దేశ సర్వోన్నత పదవిని తొలిసారి భారతీయుడు అధిష్ఠించనున్నాడు. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టమిది.