Advertisement

Advertisement


Home > Politics - National

ఎలుకల్లో కరోనా.. మానవులకు మళ్లీ ప్రమాదమా..?

ఎలుకల్లో కరోనా.. మానవులకు మళ్లీ ప్రమాదమా..?

కరోనా గబ్బిలాల వల్ల మనుషులకు సంక్రమించిందనడానికి ఇప్పటివరకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అదే సమయంలో కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాపించిందనడానికి కూడా రుజువుల్లేవు. కానీ అమెరికాకు చెందిన ఎం-బయో మేగజీన్ ప్రకారం కరోనా ఎలుకలకు కూడా వ్యాపించింది. న్యూయార్క్ సిటీలో 80 లక్షల ఎలుకల్లో ర్యాండమ్ గా కొన్నిటిని తీసుకుని వాటిపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. 79 ఎలుకల్లో 13 ఎలుకలకు కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. అంటే న్యూయార్క్ సిటీలోని ఎలుకల్లో 16.5 శాతం కరోనా బారిన పడ్డాయని తెలుస్తోంది.

పట్టించుకోకుండా వదిలేస్తే.. ?

ఎలుకలతో మనుషులకు ఉపయోగం లేదు, పైగా నష్టం కూడా. అందుకే ఎలుకలను మందు పెట్టి చంపేస్తుంటారు. మరి కరోనాతో కూడా ఎలుకలు చనిపోతాయి కదా, వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే దానివల్ల మానవులకు మేలే కదా అనుకోవచ్చు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అది తప్పుడు అభిప్రాయం అని చెబుతున్నారు. ఎలుకల్లో ఉన్న కరోనా వైరస్ మరిన్ని మ్యుటేషన్లకు కారణమై చివరకు మనుషులకు సంక్రమిస్తే అది మరింత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.

న్యూయార్క్ లోని ఎలుకల్లో కరోనా ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు కనపడ్డాయి. అయితే ఈ వైరస్ ఎలుకలకు మానవుల నుంచి సంక్రమించినట్టు చెప్పలేం. అలాగని ఆ అంచనాని తోసిపుచ్చలేం. మానవుల నుంచే ఎలుకలకు వైరస్ సంక్రమించింది అనే అనుమానం నిజమైతే, తిరిగి ఎలుకల నుంచి కూడా కరోనా వైరస్ మానవులకు రావొచ్చు, అది ఒమిక్రాన్ కంటే మరింత ప్రమాదకారిగా మారొచ్చు.

పట్టణ ప్రాంతంలో ఎలుకలకు కరోనా సోకడం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ హెన్రీ వాన్ చెబుతున్నారు. మానవులతో పాటు జంతువుల్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారాయన. ఒకవేళ జంతువులను చిన్నచూపు చూసి వాటిలో వైరస్ వ్యాప్తి చెందినా పట్టించుకోకపోతే మాత్రం అది చివరకు మానవాళికే పెను ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?